Pawan Kalyan : ఈ షర్ట్ అయినా వేసుకోనిస్తారా.? వైసీపీకి జనసేనాని పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న.!

NQ Staff - December 9, 2022 / 10:35 AM IST

Pawan Kalyan : ఈ షర్ట్ అయినా వేసుకోనిస్తారా.? వైసీపీకి జనసేనాని పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న.!

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటనల నిమిత్తం ‘వారాహి’ అనే వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న విషయం విదితమే. ఈ వాహనం రంగు విషయమై వైసీపీ నేతలు ‘తొందర’ ఆపుకోలేకపోతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు నానా రకాల వెటకారాలూ చేస్తున్నారు.

ఈ విషయమై జనసేన అధినేత సోషల్ మీడియా వేదికగా ట్వీటాస్త్రాలు సంధించారు. ఓ షర్ట్ ఫొటోని షేర్ చేస్తూ, ఈ షర్టుని అయినా వైసీపీ వేసుకోనిస్తుందా.? అని ప్రశ్నించారు.

గాలి పీల్చడం మానెయ్యాలా.?

‘నా సినిమాల్ని ఆపారు.. విశాఖపట్నంలో వాహనం నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించలేదు.. విశాఖ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశించారు. మంగళగిరిలో నా కారుని బయటకు రానివ్వలేదు.. ఇప్పుడేమో నా వాహనం రంగు మీద నానా యాగీ చేస్తున్నారు..’ అంటూ ట్వీటేసిన పవన్ కళ్యాణ్, ‘నేను శ్వాస తీసుకోవడం మానెయ్యాలా.?’ అని ప్రశ్నించారు.

Pawan Kalyan Asked About YCP On Social Media Platform

Pawan Kalyan Asked About YCP On Social Media Platform

కాగా, వాహనం రంగు విషయమై వైసీపీ అత్యుత్సాహం అనవసరమనీ, నిబంధనలు తమకు తెలుసనీ, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడాల్సిన అధికార పక్షం, వాహనాల రంగుల గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించిన సంగతి తెలిసిందే.

‘మా నాయకుడికి బాధ్యత వుంది.. వారాహి రంగు విషయమై మేం నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నాం..’ అని చెప్పారు నాదెండ్ల మనోహర్.

 

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us