నా పుట్టినరోజున ఈ పనులు చేయండి : పవన్ కళ్యాణ్

Advertisement

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, అభిమానుల మీద ప్రశంసల వర్షం కురిపించారు. అయితే సెప్టెంబర్ 3వ తేదీన తన పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా వేడుకలు నిర్వహించకూడదు అని తెలిపాడు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితులకు కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయాలని ఈ మేరకు ఆయన పిలుపునిచ్చారు. ఇక పవన్ పిలుపు మేరకు జనసైనికులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సిలిండర్లకు విరాళాలు అందజేస్తున్నారు.

అలాగే ఎన్‌ఆర్‌ఐలు, విదేశాల్లో ఉన్న జనసైనికులు, అభిమనులు కూడా తమ వంతుగా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితులను కాపాడేందుకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేస్తున్న జనసేన శ్రేణులపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here