Pawan : మొదటిసారి స్టేజ్ మీద డాన్స్ చేసిన పవన్
NQ Staff - January 12, 2023 / 06:40 PM IST

Pawan : శ్రీకాకుళం జిల్లా రణ స్థలంలో యువ శక్తి పేరిట జనసేన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జానపద కళాకారులతో కలిసి పాదం కలిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మొదటి సారి స్టేజి మీద పవన్ కళ్యాణ్ డాన్స్ చేశారు. జనాలతో కలిసి పోయే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పలు వేడుకల్లో పాల్గొంటున్నారు. జనసేన కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
సినిమా వేదికల్లో కంటే కూడా రాజకీయ వేదికల్లో పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్ గా కనిపించడం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. జానపద కళాకారులతో కలిసి పవన్ కళ్యాణ్ సాంప్రదాయ నృత్యంను చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
జనసేనను సాధ్యమైనంత వరకు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలా జనాలతో మమేకమై వారి కలలు సంప్రదాయాలను పాటిస్తూ ఆశ్చర్యపరచుతున్నాడు.
ఉత్తరాంధ్ర జానపద కళాకారులతో కలిసి పాదం కదిపిన జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.#JanaSenaYuvaShakti pic.twitter.com/neJMQM35Ev
— JanaSena Party (@JanaSenaParty) January 12, 2023