Pawan, Chandrababu’s incompetence : పవన్, చంద్రబాబు అసమర్థతే జగన్ కు బలం.. వారి ఆలస్యమే వైసీపీకి అమృతం..!

NQ Staff - February 3, 2024 / 12:57 PM IST

Pawan, Chandrababu’s incompetence : పవన్, చంద్రబాబు అసమర్థతే జగన్ కు బలం.. వారి ఆలస్యమే వైసీపీకి అమృతం..!

Pawan, Chandrababu’s incompetence : ఎన్నికలకు దగ్గర పడుతున్నాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ వైసీపీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే చాలా విడతల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. పైగా సిద్దం పేరుతో సభలను కూడా నిర్వహిస్తూ ప్రజల్లో దూసుకుపోతున్నారు సీఎం జగన్. కానీ అటు టీడీపీ, జనసేనలు మాత్రం ఇంకా అయోమయంలోనే ఉన్నాయి. పేరుకే పొత్తులు పెట్టుకున్నారు తప్ప ఇప్పటి వరకు ఒక్క సారి కూడా కలిసి మాట్లాడింది లేదు.. కలిసి పని చేసింది లేదు ఆ రెండు పార్టీలు. జగన్ ను ఓడించాలని కంకణం అయితే కట్టుకున్నారు.. గానీ.. ఇద్దరూ ఒక్కతాటిమీదకు రాలేకపోతున్నారు.

ఇక ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు ఎంతలా కత్తులు దూసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా కంటే మాకే సీట్లు కావాలని కొట్టుకునేదాకా వెళ్తున్నారు. ఇటు వైపు వైసీపీ వరుసగా ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తోంది. కొందరికి వేరే నియోజకవర్గాలు కేటాయిస్తూ మార్పులు, చేర్పులు చేస్తున్నా పార్టీలో జోష్ పెరుగుతోందే తప్ప అస్సలు తగ్గట్లేదు. అంసతృప్తులు కూడా పెద్దగా బయటకు రావట్లేదు. కానీ టీడీపీ, జనసేన మాత్రం అభ్యర్థులను ప్రకటించుకుండానే ఆ పార్టీల్లో అగ్గి రాజుకుంటోంది. ఒకవేళ జనసేన వల్ల తమకు సీట్లు రాకపోతే అల్లకల్లోలం చేసేందుకు టీడీపీ అభ్యర్థులు రెడీగా ఉన్నారు.

అటు టీడీపీ వల్ల తమకు సీట్లు రాకపోతే ఊరుకునేది లేదని జనసేన నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. దాంతో చంద్రబాబు, పవన్ వెనకడుగు వేస్తున్నారు. ఇప్పట్లో అభ్యర్థులను ప్రకటిస్తే వైసీపీ ముందు పరువు పోయేలా అభ్యర్థులు కత్తులు దూసుకుంటారని భయపడుతున్నారు. అయితే ఇలా చంద్రబాబు, పవన్ అసమర్థంగా వ్యవహరించడం వల్లనే అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోంది. ఇదే ఇప్పుడు వైసీపీకి బలంగా మారుతోందని అంటున్నారు రాజీకయ నిపుణులు. వాస్తవానికి జగన్ చాలా మార్పులు చేస్తున్నారు. అందులో కొందరు అసంతృప్తులు బయటకు వస్తున్నారు.

ఇలాంటి సమయంలో టీడీపీ, జనసేన ఒక ప్రణాళిక మీద ముందుకు వెళ్లి ఉంటే వైసీపీలో అసంతృప్తులకు అన్యాయం అని రాగం ఎత్తుకునేవి. అవి వైసీపీ నేతలను ఒకింత భయానికి గురి చేసేవి. కానీ టీడపీ-జనసేన కూటమి ఇప్పట్లో తమకు తాము ఒక నిర్ణయం తీసుకునేలా లేవు.

కాబట్టి రాజకీయ పరంగా చూస్తే టీడీపీ-జనసేన పార్టీల బలహీనతే వైసీపీకి బలంగా మారుతోందని అంటున్నారు రాజకీయ నిపుణులు. కాబట్టి ది ఒక రకంగా వైసీపీని మరోసారి అధికారంలోకి తెచ్చే అంశమే అంటున్నారు. చంద్రబాబు, పవన్ అభ్యర్థుల ప్రకటన విషయంలో ఎంత ఆలస్యం చేస్తే వైసీపికి అంత లాభమే జరుగుతుందని చెబుతున్నారు.

Read Today's Latest Politics in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us