సుశాంత్ సింగ్ కేసు విచారణ చేస్తున్న ఐపీస్ ఆఫీసర్ ను క్వారంటైన్ చేసిన ముంబై పోలీసులు

Advertisement

ముంబై: హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై వస్తున్న వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సుశాంత్ ఆత్మ హత్య చేసుకోలేదని, ఆయనది హత్యని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. ఇదిలా ఉండగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా పై సుశాంత్ తండ్రే పాట్నాలో కేసు పెట్టగా వివాదం మరో మలుపు తిరిగింది. ఈ కేసును విచారించడానికి పాట్నా పోలీసులు ముంబై చేరుకున్నారు. అయితే పాట్నా పోలీసులకు ముంబై పోలీసులు సహకరించడం లేదని సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది.

ఇదిలా ఉండగా ఈ కేసు విషయమై పాట్నా ఐపీస్ ఆఫీసర్ వినయ్ తివారి ముంబై వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన ఆఫీసర్ ను ముంబై బలవంతంగా క్వరంటైన్ చేశారని పాట్నా డీజీపీ గుప్తేశ్వర్ పాండే ట్విట్టర్ లో తెలిపారు. ఈ విషయంపై బీహార్ ముఖ్య మంత్రి నితీష్ కుమార్ కూడా స్పదించారు. ఒక ఐపీస్ ఆఫీసర్ పట్ల ఇలా దురుసుగా ప్రవర్తించడం సరికాదని, ఈ కేసును రాజకీయం చేయవద్దని నితీష్ తెలిపారు.

ఈ విషయంపై ముంబై పోలీసులు స్పందిస్తూ…డొమెస్టిక్ ఆరైవల్ నిబంధనల ప్రకారమే క్వరంటైన్ చేశామని, పాట్నా పోలీసులకు అన్ని రకాలుగా సహకరిస్తాన్నామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here