ఐపీల్ స్పాన్సర్ షిప్ రేసులో పతంజలి

Advertisement

ఐపీల్ 2020 స్పాన్సర్ షిప్ నుండి వివో సంస్థ తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీల్ స్పాన్సర్ షిప్ కోసం భారత సంస్థలు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నాయి. తాజాగా బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. వివో ఐపీల్ నుండి తప్పుకుంటే తమకు పెద్దగా నష్టం లేదని తెలిపాడు.అలాగే గత బోర్డు పాలకులు, గొప్ప ఆటగాళ్లు బీసీసీఐకి పటిష్ట పునాదులు వేశారన్నారు గంగూలీ. ఇప్పటికే చాలా కంపెనీలు ఐపీల్ స్పాన్సర్ షిప్ కోసం పోటీ పడుతున్నాయని తెలిపాడు.

ప్రస్తుతం వివో స్థానంలో పతంజలి పోటీ పడుతుంది. పతంజలి ప్రధాన ప్రతినిధి ఎస్‌కే తిజరావాలా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌ చేసేందుకు పతంజలి సిధ్ధంగా ఉందని, ప్రపంచ స్థాయి గుర్తింపు కోసం తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ఒకవైపు జియో సంస్థ కూడా ఐపీల్ స్పాన్సర్ షిప్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here