Cyber Towers Volume 11 : ఆమ్నేషియా పబ్ వ్యవహారం తెలంగాణలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పబ్‌లో అందరు మైనర్స్ కలిసి పార్టీ చేసుకొని ఆ తర్వాత ఓ యువతపై బలత్కారం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్న సమయంలో కొందరు మైనర్స్ గచ్చిబౌలీలో పార్టీ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
పట్టించుకోని వైనం..
హైదరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పబ్ ల యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మైనర్స్‌ని పబ్‌లోకి అనుమతించవద్దని చెబుతున్నా కూడా వారు పట్టించుకోవడం లేదు. జూబ్లీహిల్స్ లోని ఆమ్నిషియా పబ్ తరహాలోనే గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ లో రెండు రోజుల పాటు మైనర్లు పార్టీ చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

మైనర్ల పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతించింది. ఒక రాజకీయ నేత ప్రమేయంతో మైనర్లను పబ్ లోకి అనుమతించారని తెలిసింది. ఈ పబ్ లో పార్టీకి కొందరు సైబర్ టవర్స్ వాల్యూమ్ 11 పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యువతీ యువకులను ఆహ్వానించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ లో మైనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారని చెబుతున్నారు. అయితే మైనర్లకు తాము మద్యం సరఫరా చేయలేదని పబ్ యాజమాన్యాలు చెబుతున్నాయి.
కాగా, ఆమ్నేషియా పబ్ అత్యాచార కేసుకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హోంమంత్రి మనవడే సూత్రధారంటూ రఘునందన్ రావు ఆరోపించారు. పబ్‌లో పార్టీ బుక్ చేసిందే హోంమంత్రి మనవడని ఆయన పేర్కొన్నారు.
ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్‌గా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు, పాతబస్తీకి చెందిన ఓ ప్రముఖ దినపత్రిక డైరెక్టర్ కొడుకు , హోంమంత్రి మనవడు , హోంమంత్రి పీఏ హరిలు సీసీటీవీ ఫుటేజ్‌లో ప్రత్యక్షంగా కనిపిస్తున్నారని రఘునందన్ రావు చెబుతూ వస్తున్నారు. ఈ ఇష్యూపై విచారణ జరుగుతుంది.