CM KCR : దేశంలో కేంద్రం అరాచకాలు, ఆగడాలు మితిమీరుతున్నయి : కేసీఆర్
NQ Staff - May 27, 2023 / 04:22 PM IST

CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సారి ప్రధాని నరేంద్ర మోడీపై మరియు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తించారు. ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ మరియు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలిసి ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సుప్రీంకోర్టు తీర్పుని లక్ష పెట్టకుండా ఆర్డినెన్స్ తీసుకు వచ్చిన కేంద్రం ప్రభుత్వం కి సర్వోన్నత న్యాయస్థానం పై కూడా గౌరవం లేదని కేసీఆర్ మండిపడ్డారు. అధికారుల బదిలీలన్నీ ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. కానీ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు వచ్చి సుప్రీం కోర్టు తీర్పు ని దిక్కరిచ్చిందని కేసీఆర్ ఆరోపించారు.
లెఫ్టినెంట్ గవర్నర్ ని తీసుకు వచ్చి ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వంపై కూర్చోబెట్టడం ఎంత వరకు సబబు అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ పాలనాధికారులపై ఆర్డినెన్స్ వెనక్కు తీసుకోవాలని లేదంటే భవిష్యత్తులో మోడీ ప్రభుత్వానికి ప్రజలు గట్టి బుద్ధి చెప్పే అవకాశం ఉందని కేసీఆర్ హెచ్చరించారు.
ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఢిల్లీ పాలనాధికారాలపై ఆర్డినెన్స్ పార్లమెంటులో వ్యతిరేకిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం యొక్క అరాచకాలు.. ఆగడాలు మితిమీరుతున్నాయని సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కచ్చితంగా కేంద్రంపై పోరాటంలో తమ మద్దతుని ఇస్తామని సీఎం కేజ్రీవాల్ కి కేసీఆర్ హామీ ఇచ్చారు.