Nayanthara : ఇక షూటింగ్ కు రాకు.. నయన్ పై సీరియస్ అయిన డైరెక్టర్..!
NQ Staff - June 1, 2023 / 10:41 AM IST

Nayanthara : ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ అనగానే అందరికీ టక్కున నయనతార మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆమె దాదాపు 20 ఏండ్లుగా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. ఆమె చేసినన్ని ప్రయోగాలు కూడా ఎవరూ చేయలేదనే చెప్పుకోవాలి. వయసు పెరుగుతున్నా సరే ఆమెకు ఉన్న క్రేజ్ ఇంత కూడా తగ్గట్లేదు.
ఇదిలా ఉండగా గతంలతో ఆమె మీద ఓ డైరెక్టర్ సీరియస్ అయ్యారంట. అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ అయింది. కాగా ఇదే విషయాన్ని తాజాగా పార్థిబన్ వెల్లడించారు. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నటుడు, డైరెక్టర్ అయిన ఆయన గతంలో కుడైకుళ్ సినిమాను తెరకెక్కించాల్సి ఉంది.
అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా నయనతారను అనుకున్నారంట. ఆమెను ఉదయం 8 గంటలకు ఆడిషన్ కు రమ్మని చెప్పగా.. ఆమె రాలేదు. అదే రోజు సాయంత్రం 8గంటలకు ఫోన్ చేసి నేను ఈరోజు నేను బయలు దేరలేదు సార్. రేపు వస్తానండి అంటూ కూల్ గా చెప్పిందంట.
దాంతో పార్థిబన్ సీరియస్ అయ్యారంట. నువ్వు ఇక షూటింగ్ కు రావాల్సిన అవసరం లేదు అంటూ తెలిపారంట. దాంతో నయనతార కూడా ఆ సినిమా నుంచి తప్పుకుంది. అయితే నేడు ఆమె ఎదిగిన విధానం చూసి తాను గర్వపడుతున్నానంటూ కార్తిబన్ చెప్పుకొచ్చారు. మరి మీరు కూడా మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.