ప్రారంభమైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు

Advertisement

అన్ లాక్ ప్రారంభమైనప్పటి నుండి దేశాలు దాదాపు అన్ని పరిశ్రమలు ప్రారంభం అయ్యాయి. మొన్ననే తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే కేంద్ర స్థాయిలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు కూడా కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకొనే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడిస్తున్నారు.

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు లోక్ సభ, మధ్యాహ్నం.3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రాజ్యసభ నిర్వహించనున్నారు. సభలో సభ్యుల మధ్య దూరంతో పాటు కావాల్సిన అవకాశాలు డిజిటల్ రూపంలో ఉన్నాయి. సిబ్బంది సహా ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఎవరైనా చేయించుకోక పోతే అక్కడే పరీక్షలు నిర్వహించడానికి కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశాల్లో దేశ ఆర్థిక స్థితిగతులపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాల నుండి వచ్చే ప్రశ్నలకు బీజేపీ ఎలా సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here