Parag agarwal: ట్విట్ట‌ర్ కొత్త సీఈఓ జీతం ఎంతో తెలిస్తే నోరెళ్ల‌పెట్టాల్సిందే..!

NQ Staff - November 30, 2021 / 08:33 PM IST

Parag agarwal: ట్విట్ట‌ర్ కొత్త సీఈఓ జీతం ఎంతో తెలిస్తే నోరెళ్ల‌పెట్టాల్సిందే..!

Parag agarwal: ప్ర‌ముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్ట‌ర్ కొత్త సీఈఓగా పరాగ్ అగర్వాల్ ఎంపికైన విష‌యం తెలిసిందే. ఇప్పటివరకు సీఈఓగా ఉన్న కో ఫౌండర్‌ జాక్‌ డార్సీ రాజీనామా చేశారు. 16ఏళ్లపాటు సీఈఓగా కొనసాగిన ఆయన తన రాజీనామా లేఖను ఈ రోజు ట్విట్టర్‌లో షేర్ చేశారు. జాక్ డోర్సీ తర్వాత పరాగ్ అగ్రావాల్‌ను కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఎంచుకుంది. పరాగ్ అగ్రావాల్ ఇప్పటి వరకు కంపెనీ చీఫ్ టెక్నాలజీ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు.

parag agarwal salary hot topic

parag agarwal salary hot topic

ట్విటర్‌కి అధినేతగా ఉండేది ఒక ఇండియనే అని తెలిసిన తర్వాత చాలామంది ఇండియన్స్ గర్వంగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు అతడి ట్విటర్ సీఈఓగా తన జీతం ఎంత ఉంటుందో అని కొందరు ఆరాతీస్తున్నారు. ట్విటర్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరాగ్ అగర్వాల్‌కు సంవత్సరానికి 1 మిలియన్ డాలర్లను జీతంగా సంస్థ ఇవ్వనుంది.

వీటితో పాటు తనకు బోనస్‌లు కూడా లభిస్తాయి. అందులో ముఖ్యంగా 12.5 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు తన సొంతమవుతాయి. వీటిని మూడు నెలల గ్యాప్‌లో 16 క్వార్టర్స్‌లో తనకు అందిస్తారు. ఫిబ్రవరీ 1 నుండి ఈ షేర్స్‌ను తనకు అందిస్తారు.

12.5 మిలియన్ల విలువైన షేర్లతో పాటు మరికొన్ని షేర్స్‌ను కూడా ట్విటర్.. పరాగ్‌కు అందిస్తుంది. తన పర్ఫార్మెన్స్‌ను బట్టి ఈ షేర్స్‌ పెరగడం, తగ్గడం ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందు ట్విటర్ సీఈఓగా పనిచేసిన సంస్థ కో ఫౌండర్ జాక్ డార్సే ఏడాదికి 1.40 మిలియన్ డాలర్ల జీతాన్ని అందుకునేవాడు.

parag agarwal salary hot topic2

parag agarwal salary hot topic2

తనకంటే పరాగ్‌కు జీతం తక్కెువే అయినా.. కేవలం పదేళ్ల అనుభవంతో ట్విటర్‌లాంటి సంస్థకు సీఈఓ అవ్వడం అంటే మాటలు కాదని చాలామంది తనను ప్రశంసిస్తున్నారు. అగర్వాల్ నవంబర్ 29న ట్విట్టర్ సీఈఓగా నియమితులయ్యారు. ఇందులో మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సుందర్ పిచాయ్, ఐబీఎం అరవింద్ కృష్ణ, అడోబ్ శంతను నారాయణ్ వంటి గ్లోబల్ టెక్ సీఈఓల ఎలైట్ శ్రేణి ఇందులో ఉంది

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us