Pani Puri : రూ.20 పాత బాకీ అడిగినందుకు పానీపూరి బండి వాడిపై కత్తి దాడి
NQ Staff - January 23, 2023 / 09:50 PM IST

Pani Puri : పానీపూరి బండి వ్యక్తి 20 రూపాయల పాత బాకీ చెల్లిస్తేనే కొత్తగా మళ్లీ పానీ పూరి ఇస్తానంటూ తన వద్దకు వచ్చిన కస్టమర్ తో చెప్పడంతో ఆ కస్టమర్ ఒక్క సారిగా కోపోద్రిక్తుడై ఏకంగా పానీ పూరి బండి వ్యక్తిని కత్తితో పొడిచిన ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ జారిపట్క ప్రాంతంలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే జారిపట్క ప్రాంతంలోకి చెందిన జయరాం పానీ పూరి బండి నడిపిస్తున్నాడు. నిత్యం పానీపూరి బండి వద్దకు ఎంతో మంది వస్తుంటారు. అందులో ఒక వ్యక్తి పానీ పురి తినేందుకు వచ్చి ఒక రోజు 20 రూపాయలు బాకీ పడ్డాడు.
ఆదివారం ఆ వ్యక్తి మళ్లీ వచ్చి పానీ పూరి కావాలని అడిగాడట. పాత బాకీ 20 రూపాయలు చెల్లిస్తేనే కొత్తగా పానీ పూరి ఇస్తానంటూ జయరాం చెప్పడంతో అతడి కోపం వచ్చి కత్తి తో దాడి చేశాడు.
కత్తితో పొడిచిన ఆ వ్యక్తి అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. షాప్ దగ్గర ఉన్నవాళ్లు గాయపడ్డ జయరాం ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొన్నారు.