Pan Card : మీకు పాన్ కార్డు ఉందా? ఇవాళ రాత్రి 12 లోపు అలా చేయకపోతే 10 వేల ఫైన్ కట్టాలి?

Pan Card : మీకు పాన్ కార్డు ఉందా? వెంటనే ముందు ఇది చదవండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా… వెంటనే ఈ పని చేయాలి. లేకపోతే మీరు అనవసరంగా 10 వేల రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. పాన్ కార్డు కూడా క్యాన్సల్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే మీరు వెంటనే మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి. అది కూడా మార్చి 31, 2021 లోపే. అంటే ఈరోజు రాత్రి 12 లోపే. లేదంటే మీరు ఆర్థిక లావాదేవీల్లో ఎన్నో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

pan card should to linked with aadhaar by march 31
pan card should to linked with aadhaar by march 31

ఒకవేళ మీరు ఇప్పటికే ఆధార్ నెంబర్ తో పాన్ కార్డును లింక్ చేసుకొని ఉంటే అవసరం లేదు కానీ… ఒకవేళ లింక్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పాన్ కార్డును అనుసంధానం చేసుకోవాల్సిందే. దీనికోసం ఏ ఆఫీసుకు మీరు వెళ్లాల్సిన అవసరం లేదు.

జస్ట్… ఇంట్లోనే ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్ సైట్ లో పాన్ కార్డును అనుసంధానం చేసుకోవచ్చు. ఇన్ కమ్ ట్యాక్స్ వెబ్ సైట్ లోకి వెళ్లాక.. అక్కడ పాన్, ఆధార్ లింక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి… అందులో మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి… ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. దీంతో మీ పాన్, ఆధార్ నెంబర్ లింక్ అయిపోతాయి. ఒకసారి ఈ పని చేస్తే మరోసారి చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఇప్పటి వరకు చేయని వాళ్లు మాత్రం ఈ పని చేయాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 1 నుంచి ఇన్ కమ్ టాక్స్ చట్టానికి కొత్త రూల్స్ రాబోతున్నాయి. దీని ప్రకారం.. ఒకవేళ మీ పాన్ నెంబర్ కు ఆధార్ ను లింక్ చేయకపోతే 1000 నుంచి 10 వేల రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అలాగే… ఎలాంటి బ్యాంకు లావాదేవీలు చేసుకునే అవకాశం ఉండదు.

Advertisement