Bigg Boss 7 Telugu : ఫినాలే రేస్ లో అదరగొడుతున్న ప్రశాంత్.. అమర్ చేసిన పనికి యావర్ కన్నీళ్లు..!

NQ Staff - December 1, 2023 / 09:18 AM IST

Bigg Boss 7 Telugu : ఫినాలే రేస్ లో అదరగొడుతున్న ప్రశాంత్.. అమర్ చేసిన పనికి యావర్ కన్నీళ్లు..!

Bigg Boss 7 Telugu :

బిగ్ బాస్ సీజన్-7లో ఇప్పుడు ఫినాలే రేస్ స్టార్ట్ అయిపోయింది. ఎలాగైనా గెలిచి తీరాలని, ఫైనల్ లో నిలబడాలని అందరు కంటెస్టెంట్లు ఓ రేంజ్ లో ఆడుతున్నారు. నేనంటే నేనే గెలవాలి అన్నట్టు సాగుతుంది కంటెస్టెంట్ల ఆటతీరు. ఇక ప్రస్తుతం హౌస్ లో ఫినాలే అస్త్ర టాస్క్ నడుస్తోంది. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది కంటెస్టెంట్లు ఉన్నారు. ఇందులో నలుగురు మాత్రమే మిగిలారు. ఎందుకంటే వీరు టాస్క్ కు అనర్హత సాధించారు. మొన్నటి వరకు టాస్క్ లో ఉన్న ప్రియాంక, శోభాశెట్టి, శివాజీలు నేటితో సంచాలకులుగా మారారు. ఈ రోజు ఏడు, ఎనిమిది, తొమ్మిదో టాస్క్ లు ఈరోజు చాలా ఆసక్తికరంగా జరిగాయి.

అమర్ దీప్ చివరి దశలో బాగానే ఆడుతున్నాడు. ఎంతలా అంటే మొన్న బిగ్ బాస్ పెట్టిన క్రికెట్ గేమ్ టాస్క్ లో అమర్ అందరికంటే టాప్ లో నిలిచాడు. ఆ తర్వాత అర్జున్, ప్రశాంత్, యావర్ ఉన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ వీరికి తప్పించుకో రాజా అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్ దుమ్ము లేపాడు. అటు పక్క అమర్ దీప్ కూడా తానేం తక్కువ కాదన్నట్టు రెచ్చిపోయాడు. యావర్, గౌతమ్, అర్జున్ తర్వాత స్థానాల్లో నిలిచారు. ఇక సంచాలకులుగా వ్యవహరిస్తున్న శోభాశెట్టి, ప్రియాంకలు మాట్లాడుతూ.. అమర్ దీప్ చేసిన పనికి యావర్ కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందంటూ తెలిపారు.

Pallavi Prashanth Completing Tasks Quickly

Pallavi Prashanth Completing Tasks Quickly

ఇలా ఇచ్చిన తప్పించుకో రాజా టాస్క్ లో కాళ్లకు లాక్స్ తో కట్టిన చైన్ లను పోటీదారులు విడిపించుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రశాంత్ అదరగొట్టేశాడు. అతను మొదట కీ తీసుకుని టార్గెట్ ఫినిష్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన వచ్చిన అమర్ దీప్ కీస్ ను గందరగోళంగా పడేశాడు. దాంతో అర్జున్ చివర్లో మిగిలిపోయాడు. టాస్క్ లోన్ అర్జున్ తీరును తప్పుబట్టడంతో శివాజీతో వాగ్వాదం జరిగింది. కాగా మధ్యలో యావర్ తన పాయింట్స్ ను కోల్పోయాడు. దాంతో అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ పాయింట్స్ ను ప్రశాంత్ కు ఇచ్చాడు యావర్. దాంతో అమర్ దీప్ కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

అయితే పల్లవి ప్రశాంత్ అందరికంటే చురుగ్గా టాస్క్ లను కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. గురువారం జరిగిన ప్రతి టాస్క్ లో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ప్రతి గేమ్ లో కూడా చురుకుతనం కనబరుస్తున్నాడు పల్లవి ప్రశాంత్. ఇంకోవైపు నేనేం తక్కువ కాదని అమర్ దీప్ కూడా లైన్ లోకి వచ్చేశాడు.

అతను కూడా అన్ని గేమ్ లలో అదరగొడుతున్నాడు. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఫినాలే అస్త్ర విన్నర్ గా తెలుస్తోంది. రేపటి నుంచి టాస్క్ లలో ఎలాంటి మార్పులు ఉంటాయో తెలియనుంది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us