T20 World Cup : వరల్డ్ కప్ ఫైనల్స్‌కి పాకిస్తాన్.! టీమిండియా సంగతేంటి.?
NQ Staff - November 9, 2022 / 06:31 PM IST

T20 World Cup : టీ20 వరల్డ్ కప్ పోటీలకు సంబంధించి గ్రూప్ దశని కూడా పాకిస్తాన్ దాటలేదేమోనని అంతా అనుకున్నారు. కానీ, పాకిస్తాన్ జట్టుకి అదృష్టం కలిసొచ్చింది. ఫైనల్స్‌కి క్వాలిఫై అయ్యింది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ చేతులెత్తేయడం పాకిస్తాన్‌కి కలిసొచ్చింది.
కాగా, టీమిండియా రేపు ఇంగ్లాండ్‌తో సెమీస్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి, ఫైనల్స్‌కి వెళ్ళాల్సి వుంటుంది టీమిండియా. ప్రస్తుతం టీమిండియా వున్న ఫామ్ చూస్తోంటే, ఇంగ్లాండ్ మీద విజయం సాధించడం టీమిండియాకి పెద్ద కష్టమేమీ కాదు.
పాకిస్తాన్‌తో ఫైనల్.. ఆ కిక్కే వేరప్పా.!
వరల్డ్ కప్ పోటీల్లో ఎప్పుడూ టీమిండియాదే పై చేయి. ఒకే ఒక్కసారి టీమిండియా పరాజయం పాలయ్యిందంతే. ఈ టోర్నీలో ఇప్పటికే పాకిస్తాన్ జట్టుని ఓ సారి ఓడించింది టీమిండియా. ఆ మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్తాన్, ఓటమికి చాలా కుంటి సాకులు వెతుక్కుంది కూడా.
మొత్తమ్మీద, దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడితే.. ఆ కిక్కు వేరే లెవల్‌లో వుంటుంది. బంతి బంతికీ.. పరుగు పరుగుకీ.. క్రికెట్ అభిమానులు నరాలు తెగే ఉత్కంఠ అనుభవించాల్సిందే. ఆ మ్యాచ్ పడాలంటే, ముందు ఇంగ్లాండ్‌ని టీమిండియా ఓడించాల్స వుంటుంది.