రామ మందిరంపై పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఇండియా

Advertisement

ఢిల్లీ: ఆగస్ట్ 5న జరిగిన అయోధ్య రామ మందిర భూమి పూజను భారతీయులు ఎప్పటికి మర్చిపోరు. అయితే రామ మందిర భూమి పూజ పై పాకిస్థాన్ విదేశాంగ స్పోక్స్ పర్సన్ ఐసా ఫారూఖ్ స్పందిస్తూ… 500 సంవత్సరాలుగా అక్కడ ఉన్న బాబ్రీ మజీద్ ను కూల్చి రామ మందిరాన్ని నిర్మించడం తగదని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అలాగే ఇండియాలో మైనారిటీ మతాల యొక్క ప్రార్ధనా మందిరాలు ప్రమాదంలో ఉన్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న మెజారిటీ వర్గాన్ని మెప్పించాడు మైనారిటీ వర్గాన్ని దేశ నాయకులు అణిచివేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై భారత స్పోక్స్ పర్సన్ అనురాగ్ శ్రీవాస్తవ స్పందిస్తూ… రామ మందిర నిర్మాణం ఇండియా యొక్క వ్యక్తిగతమైన విషయమని, దీనిపై పాకిస్థాన్ స్పందించడం అనవసరమని ధీటుగా సమాధానం ఇచ్చారు. మతపరమైన వ్యాఖ్యలు చేయడం పాకిస్థాన్ మానుకోవాలని సలహా ఇచ్చారు. సరిహద్దు నియమాలను ఉల్లంఘించే పాకిస్థాన్ కూడా నీతులు చెప్పడం తగదని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here