పాకిస్తాన్ లో బారి పేలుడు

Advertisement

పాకిస్థాన్ లోని చమన్ నగరంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. నగరంలోని మాల్ రోడ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనానికి పేలుడు పరికరం (ఐఈడీ) అమర్చి బ్లాస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. అలాగే 10 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ పేలుడులో పక్కనే ఉన్న మెకానిక్ షాప్ పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ పేలుడు అనంతరం పోలీసులు ఘటన స్థలానికి వచ్చారు.

ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఘటన ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు ఇమ్రాన్ ఖాన్. ప్రమాదంలో గాయాలపాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు. అయితే ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారన్నది తెలియలేదు. ఈ ఘటనకు కారకులైన నిందితులను పట్టుకొని చర్యలు తీసుకోవాలి అని ప్రధాని ఆదేశించాడు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here