Umran Malik: కూర‌గాయ‌లు అమ్మే వ్య‌క్తి కొడుకు ఇప్పుడు ఐపీఎల్‌లో నిప్పులు చెరిగే బంతులు విసురుతున్నాడా..!

Umran Malik: ఐపీఎల్‌తో కుర్రాళ్లు రాటు దేలుతున్నారు.ఆణిముత్యాల్లాంటి క్రికెట‌ర్స్ వెలుగులోకి వ‌స్తున్నారు. ఓ బౌలర్ నిప్పులు చెరిగే బంతులు వేస్తున్నాడు. బుల్లెట్ వేగంతో దూసుకొస్తున్న బంతులను బ్యాట్స్ మెన్స్ ఎదుర్కోక తిప్పలు పడాల్సి వస్తుంది. ఇతని బాల్ వేగం చూసి…అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Pacer Umran Malik's Father On Son's IPL Debut
Pacer Umran Malik’s Father On Son’s IPL Debut

సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ఇండియన్ పేస్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత్యంత వేగంగా బంతులు విసిరిన హైదరాబాద్ బౌలర్ ఇప్పుడు నయా సంచలనం. ఈ జమ్ము కశ్మీర్ కుర్రాడు ఆ మ్యాచ్ లో ఏకంగా 151 కిలో మీటర్ల వేగంతో బంతులు విసిరి శభాష్ అనిపించుకున్నాడు.

ఈ సీజన్ లో భారత్ తరఫున అంత వేగంగా బంతిని విసిరింది ఉమ్రన్ ఒక్కడే కావడం గమనార్హం. అయితే జ‌మ్ముకి చెందిన ఉమ్రన్ మాలిక్ తండ్రి పేరు అబ్దుల్ మాలిక్. అబ్దుల్ మాలిక్ ది పేద కుటుంబం. అతడు జమ్ములోని షహీద్ చౌరస్తా దగ్గర తోపుడు బండి మీద కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన కొడుకు భారత్ తరఫున కూడా ఆడాలని ఆ తండ్రి ఆకాంక్షిస్తున్నాడు.

ఉమ్రన్ మాలిక్ వెలుగులోకి వచ్చినప్పట్నుంచి అబ్దుల్ మాలిక్ దగ్గరికి జనాల తాకిడి ఎక్కువైంది. ఆయనను కలిసిన మీడియా ప్రతినిధులతో.. ‘నా కొడుకు మూడేండ్ల వయసున్నప్పుడే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. వాడు ఎప్పుడూ ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. హైదరాబాద్ తరఫున ఎంపికైనప్పుడు, ఆదివారం కోల్కతాతో మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినప్పుడు మా ఆనందానికి అవధుల్లేవు.

ఆనందంతో నేను, నా భార్య కండ్ల వెంట నీళ్లు వచ్చాయి. ఈ స్థాయికి రావడానికి నా కొడుకు చాలా కష్టపడ్డాడు. ఉమ్రన్ ఏదో ఒకరోజు టీమ్ ఇండియా తరఫున ఆడతాడని మేము ఆశిస్తున్నాము’ అంటూ అబ్దుల్ మాలిక్ ఉప్పొంగిపోయాడు. నా కొడుకు మమ్మల్ని గర్వపడేలా చేశాడు. లెఫ్టినెంట్ గవర్నర్ గారు నా కొడుకు గురించి తెలిసి మమ్మల్ని అభినందించారు’ అంటూ చెప్పుకొచ్చారాయన.