LIFT: ఈ లిఫ్ట్ వాడితే జ‌రిమానా.. వివ‌క్ష చూపుతున్నారంటూ ఫైర్

LIFT: కరోనా మ‌హ‌మ్మారి అంద‌రి జీవితాల్లో తీర‌ని విషాదాలు క‌లిగిస్తుంది. ఈ వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఒక‌రినొక‌రు క‌లిసే ప‌రిస్థితి కూడా లేకుండా పోయింది. క‌రోనా వచ్చాక మ‌న జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మాస్క్‌, శానిటైజర్‌, ఫిజికల్‌ డిస్టెన్స్‌ వంటివి నిత్య జీవితంలో భాగమయ్యాయి.

outer siders are not allow in lift or else fine 3001
outer siders are not allow in lift or else fine 3001

వర్క్‌ ఫ్రం హోం, హైబ్రిడ్‌ వర్క్‌లాంటి పని విధానాలు వచ్చాయి. కోవిడ్‌ ఎండెమిక్‌గా ఉండిపోయే అవకాశం ఉందని ఇప్పుడే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో కరోనా ఉన్నంత కాలం అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ, హౌసింగ్‌ సొసైటీల్లో ఈ సమస్య పదే పదే ఉత్పన్నం అవుతుందంటున్నారు. ఇరు వర్గాల వాదనల్లో వాస్తవం ఉందంటున్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా అపార్ట్‌మెంట్ల నిర్మాణంలోనే సర్వీస్‌ లిఫ్టులు, శానిటైజర్‌ ఛాంబర్స్‌, డెలివరీ గేట్‌వే తదితర ఏర్పాట్లు తప్పవా ? అనే చర్చ రియల్టీ వర్గాల్లో నడుస్తోంది. తాజాగా హర్షవడ్లమాని అనే ట్విట్టర్‌ యూజర్‌ జనవరి 12న నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌ లిఫ్టు దగ్గర అంటించి నోటీస్‌ పోస్టర్‌ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ నోటీసులో ఇంటి పని చేసేవాళ్లు, డెలివరీ బాయ్స్‌, డ్రైవర్లు మెయిన్‌ లిఫ్టు ఉపయోగిస్తే రూ.300 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.

ఇంట్లో పని చేసేవాళ్లు, డ్రైవర్లు, డెలివరి బాయ్స్‌ పట్ల సదరు అపార్ట్‌మెంట్‌ వాసులు వివక్ష చూపిస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మనుషులందరు ఒకటే అని కానీ ఇలాంటి నిర్ణయాలు ఈ రోజుల్లో కూడా అమలు చేస్తున్నారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాటి మనుషుల పట్ల ఇలా వ్యవహరించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

outer siders are not allow in lift or else fine 3001
outer siders are not allow in lift or else fine 3001

పని మనుషులు లిఫ్ట్‌ ఉపయోగిస్తే రూ.300 ఫైన్‌ విధించే నిర్ణయంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తుంటే.. మరికొందరు ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరిస్తున్నారు. కరోనా వైరస్‌ భయం కారణంగా అపార్ట్‌మెంట్‌లో రాకపోకలు, కదలికపై ఆంక్షలు అమలు చేస్తున్న‌ట్టు చెబుతున్నారు.