అనుష్కతో పోటీ పడనున్న రాజ్ తరుణ్

Admin - September 15, 2020 / 12:18 PM IST

అనుష్కతో పోటీ పడనున్న రాజ్ తరుణ్

థియేటర్స్ ఇంకా ఓపెన్ కాలేదు, అయినా కూడా హీరోయిన్ అనుష్క, హీరో రాజ్ తరుణ్ తమ నెక్స్ట్ చిత్రాల రిలీజ్ తో ఒకరితో ఒకరు పోటీ పడనున్నారు. ఎలాగంటే అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. అలాగే హీరో రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా మూవీ కూడా ఆహా ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ కానుంది. మొదట నిశ్శబ్దం చిత్రాన్ని అక్టోబర్ ఎండింగ్ లో విడుదల చేద్దామని చిత్ర యూనిట్ అనుకుంది కానీ ఇప్పుడు ఈ చిత్రానికి అక్టోబర్ 2న అమెజాన్ లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమైనట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా చిత్రం కూడా అక్టోబర్ 2న ఆహా ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ కానుంది. ఒకవేళ నిశ్శబ్దం కూడా అక్టోబర్ 2కే రిలీజ్ అయితే ఓటిటిలో అనుష్క రాజ్ తరుణ్ పోటీ పడనున్నారు. ఒక్కప్పుడు థియేటర్స్ లలో పోటీపడే మూవీస్ ఈ కరోనా దయ వల్ల ఓటిటిల్లో పోటీ పడుతున్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us