RRR Movie Team In Oscar Committee : బిగ్ న్యూస్.. ఆస్కార్ కమిటీలో చోటు దక్కించుకున్న త్రిబుల్ ఆర్ టీమ్..!
NQ Staff - June 29, 2023 / 09:10 AM IST

RRR Movie Team In Oscar Committee : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ మూవీ గురించి ఇప్పటికీ ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. గతేడాది మార్చిలో విడుదలైన మూవీ ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఏకంగా రూ.1100 కోట్ల కలెక్షన్లతో దుమ్ములేపింది. ఇక అవార్డుల సంగతి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంది. ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది. ఇంత పేరు సంపాదించిన ఈ మూవీకి మరో అరుదైన ఘనత లభించింది. అదేంటంటే.. ఈ మూవీ టీమ్ కు ఏకంగా ఆస్కార్ కమిటీలో చోటు దక్కింది. మన తెలుగు వారికి ఇందులోచోటు దక్కడం ఇదే మొదటిసారి.
ప్రెస్టీజియస్‌గా భావించే ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సైన్స్ కమిటీలో RRR టీమ్ నుంచి 6గురుకి చోటు దక్కింది. ఆస్కార్ అవార్డులను అందించే ఈ కమిటీలోకి కొత్తగా 398 మంది కొత్త సభ్యులకు చోటు కల్పించారు. ఈ కొత్త వారిలో త్రిబుల్ ఆర్ టీమ్ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సాబు సిరిల్‌లకు స్థానం దక్కింది.
ఇప్పటి వరకు ఆస్కార్ కమిటీలో 10వేల మంది సభ్యులున్నారు. కొత్త వారు కూడా రావడంతో ఆ సంఖ్య 10,817 కి చేరింది. వచ్చే ఏడాది మార్చి 10న 96వ అకాడమీ అవార్డ్స్ వేడుకను నిర్వహించబోతున్నారు. కాగా తమిళ దర్శకుడు మణిరత్నంకు కూడా ఇందులో చోటు దక్కింది. కానీ రాజమౌళికి ఇందులో చోటు దక్కకపోవడం ఆయన అభిమానులను నిరాశకు గురి చేస్తోంది.