Ormax Media Top Heores List : ఇండియాలో నెంబర్ వన్ హీరో అతనే.. మన తెలుగు హీరోల పరిస్థితి ఇలా ఉందేంటి..!
NQ Staff - July 24, 2023 / 09:53 AM IST

Ormax Media Top Heores List :
సినిమా హీరోలు అంటేనే.. మా హీరో నెంబర్ వన్ అంటే మా హీరో నెంబర్ వన్ అంటూ అభిమానులు నిత్యం వాదులాడుకుంటూనే ఉంటారు. ఇలాంటి అభిమానుల కోసమే ఎప్పటికప్పుడు బాలీవుడ్ కు చెందిన ఆర్మాక్స్ మీడియా దేశంలో ఎవరు నెంబర్ వన్ అనేది ప్రతి నెలా ప్రకటిస్తూ ఉంటుంది.
ఇక గత జూన్ నెలలో ఎవరు నెంబర్ వన్ అనేది చెప్పింది. అయితే అనూహ్యంగా ఈ సారి కూడా కోలీవుడ్ హీరో దళపతి విజయ్ కు నెంబర్ వన్ స్థానం దక్కింది. ఆయనకు ఉన్న క్రేజ్, పెరుగుతున్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని దీన్ని అంచనా వేసింది ఆర్మాక్స్ మీడియా. ఇక రెండో స్థానంలో అనూహ్యంగా షారుఖ్ ఖాన్ వచ్చాడు.
పడిపోయిన ప్రభాస్..
జవాన్ సినిమాతో ఆయన ట్రెండింగ్ లోకి వచ్చాడు. ఇక మూడో స్థానంలో ప్రభాస్ ఉన్నాడు. ఆయన మొదటి స్థానం నుంచి పడిపోయాడు. నాలుగో స్థానంలో అల్లు అర్జున్ని లబడ్డాడు. ఇక ఐదో స్థానంలో మన జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. టాప్-5లో మన తెలుగు నుంచి ముగ్గురు హీరోలు మాత్రమే ఉన్నారు.

Ormax Media Top Heores List
ఆరో స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఉన్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఏడో స్థానం దక్కింది. ఈ సారి రామ్ చరణ్ ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. అక్షయ్ కుమార్ కి తొమ్మిదో స్థానం దక్కగా… మహేష్ అనూహ్యంగా టాప్ టెన్ లో చోటు దక్కించుకున్నాడు.