ఆహ్వానితులే వేడుకకు రావాలి: యోగి ఆదిత్యనాథ్

Advertisement

లక్నో: రామ మందిర భూమి పూజకు సంబంధించిన అన్ని విషయాలను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రామ జన్మభూమి, హనుమాన్ గుడిని సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి కేవలం ఆహ్వానాలు అందిన వారు మాత్రమే హాజరు కావాలని యోగి కోరారు.

ఈ కార్యక్రమానికి 150 మంది అతిథులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమనికి ఎలాంటి ఫోన్స్ గాని, కామెరలు అనుమతించడం లేదు. ఈ కార్యక్రమానికి అయోధ్య వివాదంలో కోర్ట్ లో వ్యాజ్యం వేసిన వారిలో ప్రముఖులైన ఇక్బాల్ అన్సారీ కి కూడా ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమంలో స్టేజిపై కేవలం ఐదు మంది మాత్రమే ఉండనున్నారు. వారిలో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్, యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, మహంథ్ గోపాల్ దాస్ ఉండనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here