Ongole Jr NTR CM Made Flexi : మొన్న తానాలో తన్నులాట.. నేడు ఒంగోలుగా ఎన్టీఆర్ సీఎం అంటూ ఫ్లెక్సీలు..!
NQ Staff - July 18, 2023 / 09:25 AM IST

Ongole Jr NTR CM Made Flexi :
టీడీపీలో వర్గ పోరు అస్సలు ఆగట్లేదు. కొందరేమో చంద్రబాబు, లోకేష్ నాయకత్వాన్ని మోస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం చంద్రబాబు వయసు అయిపోయింది కాబట్టి లోకేష్ సమర్ధుడు కాదని.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టీడీపీ పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడు అని కొలుస్తున్నారు.

Ongole Jr NTR CM Made Flexi
ఈ క్రమంలోనే తరచూ లోకేష్ వర్గం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరుగుతూ వస్తోంది. మొన్న అమెరికాలో నిర్వహించిన తానా సభల్లో కూడా ఇరువురి వర్గాలు కొట్టుకున్నారు. ఆ వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతకు ముందు గతంలో కూడా చంద్రబాబు మీటింగ్ లలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, కటౌట్లు ఇలాగే వైరల్ అయ్యాయి.
లోకేష్ ను ఉద్దేశించేనా..?
తాజాగా ఒంగోలులో ఎన్టీఆర్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అక్కడక్కడా కటౌట్లు కూడా ఉన్నాయి. నెక్ట్స్ సీఎం ఎన్టీఆర్ అంటూ ఇందులో రాసి ఉంది. అంతే కాకుండా అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అంటూ ఇందులో క్యాప్షన్ ఇచ్చారు. ఇది ఒక రకంగా లోకేష్ ను ఉద్దేశించే చేసినట్టు ఉంది.

Ongole Jr NTR CM Made Flexi
ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఈ ఫ్లెక్సీల ఏర్పాటుతో మళ్లీ గొడవలు జరిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు నెటిజన్లు. కాగా ఇలా గొడవలు జరుగుతుండటంపై ఇప్పటి వరకు ఎన్టీఆర్ గానీ, చంద్రబాబు, లోకేష్ లు గానీ అస్సలు స్పందించడం లేదు.
మొన్న అమెరికాలో తన్నులాట.
నేడు ఒంగోలులో భారీ కటౌట్లు.
నెక్స్ట్ సీఎం #JrNTR అంటూ ఫ్లెక్సీలు..#అసలోడువచ్చేవరకుకొసరోడికిపండగే అని క్యాప్షన్ ఇచ్చిన అభిమానులు.. @tarak9999 @JaiTDP @naralokesh pic.twitter.com/43t6dSt5NK— Sravani Journalist (@sravanijourno) July 18, 2023