కరోనాతో సహా అన్ని వైరస్ లకు ఒకటే ‘వ్యాక్సిన్’ : కేంబ్రిడ్జి యూనివర్సిటీ

Advertisement

కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ ను నివారించేందుకు ప్రపంచం లోని పలు దేశాలు వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్ లకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇక ఏడాది చివరి వరకు వ్యాక్సిన్ ను విడుదల చేయాలనీ సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ ను పోలి ఉన్న అనేక వైరస్ లు ఉన్నాయి. ఇక ఒక్కో వైరస్ కు ఒక్కో వాక్సిన్ అంటే సాధ్యం కాదు. గతంలో ఇదే వైరస్ ను పోలి ఉన్న వైరస్ ల నుండి సార్స్, మెర్స్ వంటి వ్యాధులు సంభవించాయి.

అలాగే రానున్న రోజుల్లో జంతువుల నుండి మనుషులకు అనేక రకాల వైరస్ లు సంక్రమించే అవకాశం ఉంది. అన్ని రకాల వైరస్ లను నాశనం చేసేలా ఒకే వాక్సిన్ ను తయారు చేస్తున్నట్టు కేంబ్రిడ్జి యూనివర్శిటీ వెల్లడించింది. అన్ని రకాల వైరస్ ల జన్యువిధానాలను పరిశీలించి డిఐవోఎస్ కోవాక్స్ 2 అనే వాక్సిన్ ను తయారు చేస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు. ఇక ఈ వ్యాక్సిన్ కు సంబందించిన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here