Pawan Kalyan : పవన్ కొండగట్టు పర్యటనలో అపశృతి.. ఒకరు మృతి
NQ Staff - January 24, 2023 / 10:01 PM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టకు తన పార్టీ ప్రచార రథం వారాహి కి పూజ చేయించేందుకు గాను వెళ్లిన విషయం తెల్సిందే. పవన్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో చుట్టు పక్కల ప్రాంతాల నుండి మరియు స్థానికంగా పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు మరియు అభిమానులు గుమ్మిగూడారు.
కొండగట్టు అంజన్న స్వామి ఆలయం వద్ద ఎప్పుడు ఉండే జనాలకు పది రెట్ల జనాభా అయ్యారు. ఆ సమయంలో అభిమానులకు మరియు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభివాదం చేయడంతో పాటు వారాహి వాహనంపై నిలబడి కొద్ది సమయం మాట్లాడాడు.
అక్కడ నుండి తిరుగు ప్రయాణం సందర్భంగా కూడా అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాన్ ను ఫాలో అయ్యారు. ధర్మపురి నుండి హైదరాబాద్ కు తిరిగి వెళ్తున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున ఫాలో అవుతూ ఉండగా ప్రమాదం జరిగింది.
వెల్గటూరు మండలం కిషన్ రావు పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లోని ఒక వాహనం ఢీ కొట్టడంతో యువకుడు మృతి చెందాడు. అంతే కాకుండా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి అంటూ సమాచారం అందుతోంది. యువకుడి మృతదేహం ను ధర్మపురి మార్చురీకి తరలించారు.. గాయాల పాలు అయిన వారికి చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.