INDIA : ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు ఆడనున్న భారత్.. జట్టుని ప్రకటించిన బీసీసీఐ
Samsthi 2210 - March 19, 2021 / 12:47 PM IST

INDIA :ఇంగ్లండ్‌తో భారత్ సుదీర్ఘ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ముందుగా ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారత్ ఇప్పుడు టీ 20 సిరీస్ ఆడుతుంది. ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా, ఇరు జట్లు రెండు విజయాలు సాధించాయి. మార్చి 20న జరగనున్న చివరి టీ 20లో ఎవరు విజేతగా నిలుస్తారో వారికి సిరీస్ దక్కనుంది. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు ఆడుతున్నారు.
టీ 20 సిరీస్ ముగిసిన తర్వాత భారత్ – ఇంగ్లండ్ జట్లు పుణే వేదికగా మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ వన్డే సిరీస్ కోసం తాజాగా టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలకు తొలిసారి వన్డే టీమ్‌లో చోటు దక్కగా, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడిన మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, సంజు శాంసన్‌లను తప్పించారు. పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వన్డే టీమ్‌లోకి తిరిగొచ్చాడు. బుమ్రాకు రీసెంట్‌గా పెళ్లి కావడంతో అతనికి విశ్రాంతినిచ్చారు. అలానే షమి, రవీంద్ర జడేజా ఇంకా గాయాల నుంచి కోలుకోకపోవడంతో బీసీసీఐ వారి పేర్లను పరిశీలించలేదు.
ప్రస్తుతం టీ20 సిరీస్ ఆడుతున్న టీమ్‌కు అదనంగా కృనాల్ పాండ్యా వన్డే జట్టులో చోటు దక్కించుకోగా, మార్చి 23 నుండి ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. 26న రెండో వన్డే, 28న మూడో వన్డే జరగనుంది.
వన్డేలకు టీమిండియా: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, చాహల్, కుల్‌దీప్, కృనాల్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్.