Omicron : ఇండియాలో మూడో ఒమిక్రాన్ కేసు న‌మోదు.. ఎక్క‌డో తెలుసా?

Omicron : దేశంలో ఒమిక్రాన్ గుబులు రేపుతుంది. మెల్ల‌మెల్ల‌గా మ‌నందేశంలోకి కూడా ఒమిక్రాన్ అడుగుపెట్టింది.సౌతాఫ్రికాతో పాటు ఇతర దేశాల్లో ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలకు ఈ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. భారత్ లోనూ రోజురోజుకు ఒమిక్రాన్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి.

Omicron virus in india
Omicron virus in india

విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్ పోర్టుల్లో విస్తృత పరీక్షలు చేస్తున్నారు.. లక్షణాలు ఉంటే క్వారంటైన్ లో ఉంచి.. జీనోమ్ సీక్వెన్స్ కోసం ల్యాబ్ కు పంపుతున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీలో ఒమిక్రాన్ అనుమానిత కేసులు 12కు చేరాయి. వీళ్లందరి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు.

క‌ర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా శనివారం మరో ఒమిక్రాన్‌ కేసును గుర్తించారు. గుజరాత్‌, జామ్‌నగర్‌కు చెందిన వ్యక్తిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు ఆ రాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు. ఇతడు కొన్ని రోజుల క్రితమే జింబాబ్వే నుంచి గుజరాత్‌ వచ్చినట్లు తెలిసింది.

72 ఏళ్ల బాధిత వ్యక్తి జింబాబ్వే నుంచి వచ్చిన తర్వాత స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. టెస్ట్‌లు చేయింగా.. గురువారం అతడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక అతడి శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు రాష్ట్ర హెల్త్‌ కమిషనర్‌ జై ప్రకాశ్‌ శివ్‌హారే తెలిపారు. బాధితుడిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రకటించారు. ఈ కేసుతో దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది.

ఒమిక్రాన్ వ‌స్తే తీవ్రమైన కండరాల నొప్పులు,చికెన్‌గున్యా లక్షణాలు, తీవ్రమయిన అలసట ఉంటుంద‌ట‌. దీని వ‌ల‌న ఇప్ప‌టికైతే మ‌ర‌ణాలు సంభ‌వించ‌కపోవ‌డం కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగించే విష‌యం.