Omicron: ఎలుక‌ల నుండి ఒమిక్రాన్… కీల‌క విష‌యాలు వెల్ల‌డించిన అమెరికా ప‌రిశోధ‌కులు

NQ Staff - April 29, 2022 / 11:10 AM IST

Omicron: ఎలుక‌ల నుండి ఒమిక్రాన్… కీల‌క విష‌యాలు వెల్ల‌డించిన అమెరికా ప‌రిశోధ‌కులు

Omicron: కొద్ది రోజులుగా ప్ర‌పంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి ఎంత‌గా వ‌ణికిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌రోనా వ‌ల‌న చాలా మంది మృత్యువాత ప‌డ్డారు. కరోనా పుట్టుక గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. క‌రోనా మూడో దశలో ప్రపంచాన్ని చుట్టేసిన ఒమిక్రాన్ వేరియంట్ ఎలా పుట్టుకొచ్చిందన్న ప్రశ్నకు అమెరికా పరిశోధకులు తాజాగా వెల్లడించిన వివరాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Omicron Transmission from Rats to Humans

Omicron Transmission from Rats to Humans


ఈ వేరియంట్ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తిలో ఉత్పరివర్తనాల వల్ల పుట్టుకొచ్చింది కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎలుకల నుంచే బహుశా ఇది మానవుల్లో ప్రవేశించి ఉండొచ్చని అన్నారు. జంతువుల్లో కరోనా వైరస్ వేల సంఖ్యలో ఉత్పరివర్తనాలకు గురవుతూ మానవుల్లో వేగంగా వ్యాప్తి చెందడమే కాకుండా, అత్యంత ప్రాణాంతక వేరియంట్‌గా మారేందుకు అవకాశాలు ఉన్నట్టు గుర్తించారు.

కరోనా వ్యాప్తిలో జంతువుల పాత్రను విస్మరించడానికి లేదని, అవి కొత్త వేరియంట్లకు రిజర్వాయర్లుగా పనిచేస్తాయని అమెరికా నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్‌ BA-4, BA-5 సబ్ వేరియంట్లు మునుపటి BA-2 సబ్ వేరియంట్ కంటే ఎక్కువ వ్యాప్తిని కనిపిస్తున్నాయని, ఇది అసలు ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఎక్కువ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చెప్పారు.

దక్షిణాఫ్రికాలోని తొమ్మిది ప్రావిన్సులలో ఏడు, ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలలో సబ్‌ వేరియంట్లు కనుగొన్నారు. ఈ నెలలో దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వ్యాక్సిన్‌, సహజ రోగనిరోధక శక్తిని తప్పించుకోగలవని జీన్ సీక్వెన్సింగ్ యూనిట్ల అధిపతి చెప్పారు. BA-4, BA-5 సబ్ వేరియంట్లు మునుపటి BA-2 వేరియంట్ కంటే ఎక్కువ వైరస్ వ్యాప్తిని పెంచుతున్నట్లుగా కనిపిస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ అధిపతి తులియో డి ఒలివేరా చెప్పారు.

రోగనిరోధక శక్తినిసైతం దాటుకొని వచ్చేలా ప్రస్తుతం ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్లు ఉన్నాయని, ఇది మళ్లీ వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని, ఇది కొన్ని వ్యాక్సిన్‌లను విచ్ఛిన్నం చేయగలదని మేము ఆశిస్తున్నామని డి ఒలివేరా చెప్పారు. ఎందుకంటే దక్షిణాఫ్రికాలో కేసులు పెరగడానికి ఇదే ఏకైక మార్గం అన్నారు

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us