Omicron:  ఒమిక్రాన్ అల‌ర్ట్‌.. విదేశాల నుండి హైద‌రాబాద్‌కి వ‌చ్చిన 11 మందికి క‌రోనా

Omicron: క‌రోనా వేరియెంట్ ఒమిక్రాన్ గుబులు పుట్టిస్తుంది. దీని వ్యాప్తి భారీగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇక్క‌డ అక్క‌డ అంత‌టా ఈ వైర‌స్ వ్యాపిస్తుంది. ఒమిక్రాన్‌ వేరియంట్ రూపంలో ముప్పు పొంచి ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్‌వో ) హెచ్చరికలు జారీ చేసింది. భారత్‌లో విలయతాండవం చేసిన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ 6 రెట్లు వేగంగా సంక్రమిస్తుందని హెచ్చరించింది.

omicorn attrack 11 members
omicorn attrack 11 members

సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. తాజాగా భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరులో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను గుర్తించినట్లు కేంద్రం శుక్రవారం అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోనూ ఒమిక్రాన్ కలకలం రేగింది.

పలు దేశాల నుంచి వచ్చిన విదేశీ ప్రయాణికుల్లో 11 మంది కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. శుక్రవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగిన వారికి.. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా కరోనా బారినపడ్డట్లు గుర్తించారు. దీంతో అధికారులు వారిని గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి, చికిత్సలు అందిస్తున్నారు. 11 మంది ప్రయాణికుల్లో యూకే నుంచి తొమ్మిది మంది, సింగపూర్‌, కెనడా, అమెరికా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

omicorn attrack 11 members1
omicorn attrack 11 members1

కరోనా పాజిటివ్‌గా తేలిన ప్రయాణికుల నమూనాలను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపారు. నిన్న బ్రిటన్‌ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లాకు చెందిన కరోనా పాజిటివ్‌గా పరీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా 11 మంది వైరస్‌ బారినపడగా.. మొత్తం కేసుల సంఖ్య 12కు పెరిగింది.