Smuggling : శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.!
NQ Staff - November 24, 2022 / 08:54 PM IST

Smuggling : బంగారం స్మగ్లింగ్‌కి విమానాశ్రయాల్ని ‘సరైన’ మార్గాలుగా ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. తాజాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఒమర్ అల్ కేసరీ అనే ప్రయాణీకుడి నుంచి అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో 1821 గ్రాముల బంగారం బయటపడింది. బంగారాన్ని పేస్టుగా మార్చి, కాటన్ బాక్సుల్లో దాచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలింది.
నిందితుడి అరెస్ట్..
బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఒమర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒమర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా దేశంలోని పలు విమానాశ్రయాల్లో బంగారం భారీగా పట్టుబడుతూ వస్తోంది. అయినాగానీ, స్మగ్లింగ్ మాత్రం ఆగడంలేదు.
ఇదిలా వుంటే, శంషాబాద్ విమానాశ్రయంలో తాజాగా పట్టుబడ్డ బంగారం విలువ కోటి రూపాయలకు పైగా వుంటుందని అధికారులు తెలిపారు. ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి ఈ బంగారం స్మగ్లింగ్ జరుగుతూ వస్తోంది.
ఇలాంటి సందర్భాల్లో బంగారం స్మగ్లింగ్ సూత్రధారులు మాత్రం దొరకడంలేదు.