Mukesh Ambani : అంబానీ ఇంటికి ఆలివ్ చెట్లు.. వాటి ధ‌ర తెలిస్తే అవాక్క‌వ్వ‌డం ఖాయం..!

Mukesh Ambani : ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జం ముఖేష్ అంబానీ ఇంటికి తూర్పుగోదావరి జిల్లా కడియం చెట్లు వెళ్లాయి. గుజరాత్‌లోని జామనగర్‌లో అంబానీ నిర్మించే ఇంటి ఆవరణలో నాటేందుకు ఇక్కడి నుంచి రెండు ఆలివ్‌ చెట్లను తీసుకెళ్లారు. ఒక చెట్టు ధ‌ర రూ.22 ల‌క్ష‌లు కాగా, ర‌వాణాకు మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు అవుతుంది.

olive trees moving from kadiyam to mukesh ambanis new house
olive trees moving from kadiyam to mukesh ambanis new house

గురువారం రాత్రి ట్రాలీలో తరలించారు. గౌతమి నర్సరీ నుంచి ఈ చెట్లు పంపిస్తున్నారు. ఈ చెట్లను గతంలో స్పెయిన్‌లో నుంచి తెచ్చామని నర్సరీ అధినేత మార్గాని వీరబాబు తెలిపారు. చాలా ఏళ్లుగా ప్రత్యేక శ్రద్ధతో పెంచగా ఇంత ధర దక్కిందన్నారు. ఇక చెట్లు అంబానీ ఇంట్లో కనువిందు చేయనున్నాయి.

ప్ర‌స్తుతం ఈ చెట్ల‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆసియా కుబేరుడుగా రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, ఇపుడు ఈయన్ను మరో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ క్రాస్ చేశారు.

బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఇప్పటివరకు ఆసియా కుబేరుడుగా ముఖేశ్ అంబానీ కొనసాగుతున్నారు. అయితే, ఇదే బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం గౌతం అదానీ సంపద 88.8 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీ సంపద 91 బిలియన్ డాలర్లు. ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే. ఈ డేటా తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అదేసమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ పరుగులు పెట్టింది. ఆరామ్‌కో ఒప్పందం తర్వాత రిలయన్స్ షేర్లు రోజురోజుకూ క్షీణిస్తూ వస్తున్నాయి.

ఈ యేడాది జనవరి ఒకటో తేదీ నుంచి అదానీ సంపద 55 బిలియన్ డాలర్ల మేరకు పెరగా, అదేసమయంలో ముఖేశ్ అంబానీ సంపదలో వృద్ధిరేటు 14.3 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఆసియా కుబేరుడుగా గౌతమ్ అదానీ అవతరించారని అంటున్నారు.