వృద్ధుడి బ్యాంక్ ఖాతాలో రూ. కోటి క్రెడిట్. ఒక్కసారిగా షాక్

Advertisement

ఓ వృద్ధుడి ఖాతాలో కోటి రూపాయలు వచ్చి పడ్డాయి. దీనితో ఆ వృద్ధుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే అమెరికాలో ఈ సంఘటన జరిగింది. అయితే అమెరికాలోని మిన్నెసోటాలోగల క్రిస్టల్ ప్రాంతానికి చెందిన థామస్ ఫ్లాహింగ్‌కు 73 ఏళ్ల వయస్సు. అయితే అతడికి సన్‌రైజ్ బ్యాంకులో ఓ ఖాతా ఉంది. అయితే తాజాగా ఆ ఖాతాలో 150,000 అమెరికన్‌ డాలర్లు అంటే 1.09 కోట్ల రూపాయలు వచ్చి చేరాయి.

అయితే బ్యాంక్‌ తప్పిదం వల్ల తన ఖాతాలో డబ్బులు పడి ఉంటాయని భావించాడు. కానీ రోజులు గడుస్తున్నా ఎవరు కూడా సంప్రదించలేదు. తరువాత ఇతరుల సొమ్ము నాకెందుకులే అని బ్యాంకుకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పుదాం అని నిర్ణయం‌ తీసుకున్నాడు. కానీ ఇక ఆ లోపే ఫ్లాహింగ్‌ బ్యాంక్ ఖాతానుంచి ఆ డబ్బును తీసేసుకుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here