RRR : మొద‌లైన నాటు నాటు పాట‌ హంగామా.. బామ్మ స్టెప్పుల‌కు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా

RRR: దక్షిణాదిలో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా రూపొందుతున్న‌ మెగా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. నందమూరి, మెగా హీరో కాంబోలో జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు సినీ పరిశ్రమలో ఇటు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రంపై ప్ర‌తి ఒక్క‌రిలో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

natu natu song in RRR
natu natu song in RRR

2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి తనదైన స్టైల్ లో సినిమా పై ఆసక్తిని రేకెత్తించేలా ప్రమోషన్ కార్యక్రమం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ మూవీ నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల అయింది.

RRR movie song
RRR movie song

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరూ డ్యాన్స్ లో తమదైన శైలిలో ఇర‌గ‌దీసారు . దీంతో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అంటూ ఓ రేంజ్ లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లోనే యూట్యూబ్ లో వ్యూస్ తో సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు విడుదలైన అన్ని భాషల్లో కలిపి 15 మిలియన్ల ​ వ్యూస్​ను రాబట్టింది.

old lady steps for natu natu song in RRR movie
old lady steps for natu natu song in RRR movie

దీంతో పాటు, 1 మిలియన్స్​కి పైగా లైక్స్​ ను కూడా సాధించింది. కీరవాణి సంగీతం అందిస్తున్నఈ పాట‌ను యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న కాలభైరవ, యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ ఇద్దరూ కలిసి చాలా చక్కగా, ఎనర్జిటిక్‌గా పాడారు.

ఈ పాటకు ఓ బామ్మ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  సాంగ్ ప్లే అవుతుండగా బామ్మ అదిరిపోయే స్టెప్స్ వేశారు. నో ఏజ్ లిమిట్ ఫర్ ఫ్యానిజమ్ అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ చేసేస్తున్నారు.