Ola Electric Car : ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టిన ఓలా.. సెకండ్‌ హ్యాండ్‌ కార్లు, గ్రోసరీ బిజినెస్‌ నిలిపివేత‌

NQ Staff - June 26, 2022 / 08:43 PM IST

Ola Electric Car : ఎలక్ట్రిక్‌ కార్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టిన ఓలా.. సెకండ్‌ హ్యాండ్‌ కార్లు, గ్రోసరీ బిజినెస్‌ నిలిపివేత‌

Ola Electric Car : ప్ర‌ముఖ ఓలా సంస్థ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఓలా ఎలక్ట్రికల్‌ వాహనాల బిజినెస్‌ పుంజుకుంటున్నందున దీనిపై మరింత ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని ఓలా నిర్ణయించింది. ప్రధానంగా ఓలా ఎలక్ట్రిక్‌ కార్ల , బ్యాటరీ తయారీపై కేంద్రీకరించ‌నుంది. వీటితో పాటు పైనాన్షియల్‌ సర్వీసెస్‌పై కూడా వృద్ధి చేయనుంది.

Ola Electric Car launch plans

Ola Electric Car launch plans

బిజినెస్‌పై ప‌ట్టు..

దేశంలో ప్రస్తుతం ఉన్న సెకండ్‌ హ్యాండ్‌ కార్ల విక్రయాలు, గ్రోసరీ బిజినెస్‌ను నిలిపివేస్తున్నట్లు ఓలా ప్రకటించింది.
బిజినెస్‌ లక్ష్యాలు మారినందునే ఈ బిజినెస్‌లను నిలివేస్తున్నట్లు ఓలా తెలిపింది. ఓలా ఎలక్ట్రికల్‌ ప్రస్తుతం 500 కోట్ల రూపాయాల ఆదాయాన్ని అధికమించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వెయ్యి కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఓలా మార్కెట్‌లో రెండు ఓలా స్కూటర్స్‌ మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. త్వరలోనే మరో స్కూటర్‌ను విడుదల చేయనుంది.

వాహన మార్కెట్‌లో మరింత బలోపేతం అయ్యేందుకు ఓలా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వాహన శ్రేణిని మరింత విస్త్రత పరచడం ద్వారా మార్కెట్‌లో పట్టుసాధించాలని నిర్ణయించింది. కంపెనీ మొబిలిటీ సేవలు 500 మిలియన్‌ ఇండియన్‌కు చేరడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాల బిజినెస్‌ను ఓలా 2021 అక్టోబర్‌లో ప్రారంభించింది. 30 పట్టణాల నుంచి ప్రస్తుతం వంద నగరాల్లో ఓలా కార్స్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయి. వీటిని క్రమంగా తగ్గిస్తామని ఓలా సీఈవో అరుణ్‌ శ్రీదేశ్‌ముఖ్‌ తెలిపారు. ఇటీవల వరసగా ఓలా స్కూటర్స్‌లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నందున కంపెనీ 1441 స్కూటర్స్‌ను వెనక్కి పిలిపించింది. వీటిని కంపెనీ ఇంజనీర్లు క్షుణంగా పరిశీలిస్తున్నారని సీఈవో అరుణ్‌ శ్రీదేశ్‌ముఖ్‌ తెలిపారు.

ఓలా ఎలక్ట్రిక్‌ కారుపై ప్రస్తుతం ఆర్‌ అండ్‌ డి వర్క్‌ జరుగుతుందని ఓలా ఫౌండర్‌ భావిష్‌ అగ్రవాల్‌ వెల్లడించారు. ఓలా ఎలక్ట్రిక్‌ కారును 2023 లేదా 2024 ప్రారంభంలో మార్కెట్‌లోకి తీసుకు వస్తామని ప్రకటించారు. ఈ కార్లను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామన్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us