Viral News : హాస్టల్‌ లో ఉండి 9వ క్లాస్ చదువుతున్న అమ్మాయికి కడుపు నొప్పి.. హాస్పిటల్ కు వెళ్తే మగ బిడ్డకు డెలవరీ

NQ Staff - January 22, 2023 / 06:43 PM IST

Viral News : హాస్టల్‌ లో ఉండి 9వ క్లాస్ చదువుతున్న అమ్మాయికి కడుపు నొప్పి.. హాస్పిటల్ కు వెళ్తే మగ బిడ్డకు డెలవరీ

Viral News : ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ప్రెగ్నెంట్ అవ్వడంతో పాటు ఏకంగా డెలివరీ అయ్యి హాస్పిటల్ లో మగ బిడ్డకు జన్మనిచ్చింది.

14 ఏళ్ల అమ్మాయి ప్రసవించడంతో అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం కు చెందిన బాలిక జిఎంసి బాలయోగి గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది.

నిన్న శనివారం మధ్యాహ్నం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆమెను హాస్టల్స్ సిబ్బంది స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు. డాక్టర్లు స్కాన్ చేసి బాలిక ప్రెగ్నెంట్ అని నిర్ధారించారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఆ బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది.

14 ఏళ్ల అమ్మాయి.. అది కూడా హాస్టల్లో ఉన్న అమ్మాయి గర్భవతి అనే విషయం బయటకి రాకపోవడం, ఇన్ని రోజులు బాలిక యొక్క ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోక పోవడంతో హాస్టల్ సిబ్బందిపై అధికారులు సీరియస్ అయ్యారు.

కేసు నమోదు చేసిన పోలీసులు బాధిత తల్లి కావడానికి కారణమెవ్వరు అనే విషయాన్ని ఎంక్వూయిరీ చేస్తున్నారు. బాలిక యొక్క మేనమామ అందుకు కారణం అయ్యి ఉంటాడు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆ దిశగా ఎంక్వౌయిరీ ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం బాలికను మరియు శిశువుని అధికారుల పర్యవేక్షణలో ఉంచారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us