Odisha Train Accident : ఛీ..ఛీ.. రైలు ప్రమాదంలో శవాలను కూడా వదలని నీచులు.. ఇదేం దారుణం..!
NQ Staff - June 7, 2023 / 12:01 PM IST

Odisha Train Accident : దేశ చరిత్రలోనే అతిపెద్ద రైలు ప్రమాదంగా నిలిచిపోయింది ఒడిశా రైలు ప్రమాదం. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 300లకు దగ్గరలో ఉంది. ఇంకా మృతులు పెరుగుతూనే ఉన్నారు. గాయపడిన వారి సంఖ్య కూడా 1100 దాటిపోతోంది. వందలాది కుటుంబాల జీవితాలు తలకిందులు అయిపోయాయి.
ఇందులో చనిపోయిన వారు అధికంగా కడు పేద, మధ్యతరగతి వారే ఉన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కోసం ఎంతోమంది ముందుకు వస్తున్నారు. సెహ్వాగ్ చనిపోయిన వారి పిల్లల్ని చదివిస్తానని హామీ ఇచ్చాడు. ఇతర సెలబ్రిటీలు, దాతలు కూడా భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా భారీ ఎత్తున నష్టపరిహారం అందిస్తామని చెప్పింది.
అటు ఎల్ ఐసీ కూడా బాధితుల క్లెయిమ్‌లను సత్వరం పరిష్కరిస్తామని ప్రకటించింది. ఇలా ఎవరికి వారు తోచినంత సాయం చేస్తుంటే కొందరు కేటుగాళ్లు మాత్రం నీచానికి ఒడిగట్టుతున్నారు. ఫేక్ ఫొటోలు, సర్టిఫికెట్లతో చనిపోయింది తమవారే అని నమ్మించి నష్టపరిహారాలను కొట్టేయాలని చూస్తున్నారు.
తాజాగా కటక్ నగరానికి చెందిన గీతాంజలి దత్తా అనే ఒక మహిళ రైలు ప్రమాదంలో చనిపోయిన వారి ఫొటోల వద్దకు వచ్చింది. అందులో ఒక వ్యక్తి ఫొటోను చూపించి అతను భర్తే అని చనిపోయాడంటూ చెప్పింది. కానీ ఆమెను పోలీస్ స్టేషన్ లో విచారించగా తన భర్త బతికే ఉన్నాడని తేలింది. దాంతో ఒడిశా ప్రభుత్వం అలెర్ట్ అయింది. పకడ్బందీగా చనిపోయిన వారి వివరాలు సేకరిస్తున్నారు.