అక్టోబర్ లో ఎన్ని మూవీస్ ఓటిటిలో వస్తున్నాయో తెలుసా!

Advertisement

కరోనా కష్ట కాలంలో థియేటర్స్ మూతపడటం వల్ల షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీస్ ఓటిటిలలో విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే చాలా మూవీస్ రకరకాల ప్లాట్ఫామ్ లలో విడుదల అయ్యాయి. నాని నటించిన V చిత్రం కూడా ఈ నెల 5న అమెజాన్ లో స్ట్రీమ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు థియేటర్స్ మూతపడటం వల్ల ఓటిటిలో మూవీస్ పోటీ పడుతున్నాయి.

వచ్చే నెలలో దాదాపు 6 మూవీస్ ఓటిటిలో విడుదల అవుతున్నాయి. అక్టోబర్ 2న అనుష్క నటించిన నిశ్శబ్దం మూవీ అమెజాన్ లో స్ట్రీమ్ కానుంది.అలాగే రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా కూడా అక్టోబర్ 2న ఆహా లో స్ట్రీమ్ కానుంది. అలాగే అక్టోబర్ 23న మిర్జాపూర్ అమెజాన్ లో, అలాగే అదే రోజున సుహాస్ నటించిన కలర్ ఫోటో మూవీ ఆహాలో స్ట్రీమ్ కానున్నాయి. అదే విధంగా అక్టోబర్ 30న సుధ కొంగరా దర్శకత్వంలో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా మూవీ అమెజాన్ లో స్ట్రీమ్ కానుంది. అలాగే విజయ్ సేతుపతి నటించిన రనిసంగం కూడా అక్టోబర్ 2న జీ ప్లెక్స్ లో స్ట్రీమ్ కానుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here