Bhumika Chawla : రీ రిలీజుల్లో స్టార్ హీరోలతో పాటు భూమిక హవా. అప్పటి హార్డ్ కోర్ ఫ్యాన్సునీ మళ్లీ మెస్మరైజ్ చేస్తోన్న హీరోయిన్
NQ Staff - January 24, 2023 / 07:54 PM IST

Bhumika Chawla : టాలీవుడ్లో కొత్త సినిమాల విడుదలకు తీసిపోని తీరు రీ రిలీజుల హవా నడుస్తోంది. స్టార్ హీరోల ఫ్యాన్సయితే పోటీల మీద తమన ఫేవరేట్ యాక్టర్ల హిట్ సినిమాలను మళ్లీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హ్యాష్ ట్యాగులతో ప్రచారం చేసేస్తున్నారు కూడా. చిరు, బాలయ్య, వెంకీ, ప్రభాస్, పవన్.. ఇలా పెద్ద హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు అడపా దడపా విడుదలవుతుండడం చూస్తూనే ఉన్నాం. కానీ రీసెంటుగా రీ రిలీజుల్లో బడా హీరోలకి పోటీగా హవా చాటుతోన్న హీరోయిన్ భూమికే.
ఖుషీ మూవీ 2022 డిసెంబర్ 31 న మళ్లీ విడుదలై పవర్ స్టార్ అభిమానుల్లో న్యూఇయర్ సందడిని డబల్ చేసింది. పవన్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఆ మూవీ రీరిలీజుని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఓ రకంగా చెప్పాలంటే థియేటర్ల దగ్గర పవన్ కళ్యాణ్ కొత్త మూవీ రిలీజుకి తీసిపోని హడావిడి చేశారు. ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ అయిన ఆ మూవీలో మధుమతిగా తన పాత్రలో సూపర్బ్ గా నటించింది భూమిక. పర్ఫామెన్సుతో పాటు డ్యాన్స్, గ్రేస్ పరంగా కూడా ఆడియెన్సును కట్టిపడేసింది. ఇన్నేళ్ల తర్వాత కూడా స్క్రీన్ పై భూమికని చూసి అంతే మెస్మరైజ్ ఫీలయ్యారు ఆమె ఫ్యాన్స్.
ఇక మహేష్ కెరీర్నే మలుపు తిప్పిన ఒక్కడు జనవరి 7న రీ రిలజ్ కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్సుకి పండగ సందడి ముందే స్టార్టయిపోయింది. ఆ మూవీలో మహేష్ పర్ ఫామెన్సు, స్టయిల్ అండ్ స్వాగ్ కి అప్లాజ్ దక్కడంతో పాటు భూమిక యాక్టింగ్ కి, గ్లామర్ కి యూత్ ఫిదా అయ్యారు. నువ్వేం మాయ చేశావో గానీ అని ఆడిపాడుతూ క్యూట్ లుక్స్ తో ఆడియెన్సునూ మాయ చేసింది. ఇప్పుడు థియేటర్లో రిలీజయ్యాక కూడా చెప్పవే చిరుగాలి పాటకి తన స్టెప్సుని మ్యాచ్ చేస్తూ ఆడియెన్స్ ఆడిపాడారు కూడా.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సంబర్భంగా సింహాద్రి మూవీ కూడా మే 20న గ్రాండ్ గా రీ రిలీజ్ కానుంది. త్రిబులార్ తర్వాత తారక్ కొత్త మూవీ ఏదీ రిలీజ్ కాలేదు. దీంతో సింహాద్రి మళ్లీ రిలీజ్ కానుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకోనున్నారు. దాదాపు బడా స్టార్ల సినిమాలు ఏదో ఓ అకేషన్ చూసి రీ రిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ మూవీ ఏదీ రావట్లేదని ఈగర్ గా వెయిట్ చేస్తున్న హార్డ్ కోర్ అభిమానులు ఈసారి రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Occasion Of Jr NTR Birthday Simhadri Movie Will Re Released On May 20
తారక్ కెరీర్ ని టాప్ లో నిలబెట్టిన మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టెయినర్ సింహాద్రి. ఈసారి రీ రిలీజుల్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. అయితే ఇంట్రస్టింగ్ గా ఈ మూవీలో కూడా భూమికే హీరోయిన్.
ఇలా వరుసగా స్టార్ హీరోల సినిమాలు రీ రిలజవుతుండగా అందులో భూమికే హీరోయిన్ కావడంతో అప్పటి ఆమె ఫ్యాన్స్ నోస్టాలజీగా ఫీలవుతున్నారు. ఇప్పుడెంత మంది యంగ్ హీరోయిన్స్, స్టార్ యాక్ట్రెస్ వచ్చినా గ్లామర్ గాళ్ అండ్ పర్ఫామర్ గా ఒకప్పటి భూమిక క్రేజ్ అండ్ రేంజే వేరంటూ మెమరీస్ ని గుర్తుచేసుకుంటున్నారు. మరి సింహాద్రి తర్వాత ఇంకే మూవీతో భూమిక రీ రిలీజుల్లో హవా కంటిన్యూ చేస్తుందో చూడాలి.