అనకాపల్లి సబ్ జైల్ లో నూతన్ నాయుడు

Advertisement

పెందుర్తి శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు అయిన నూతన్ నాయుడిని కర్ణాటకలోని ఉడిపిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడి నుంచి అర్ధరాత్రి విశాఖ తీసుకొచ్చిన పోలీసులు కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నూతన్‌ నాయుడిని అనకాపల్లి సబ్‌జైలుకు తరలించారు.

అయితే ఇప్పటికే ఈ కేసులో నూతన్ నాయుడు భార్య ప్రియాతో సహా మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈకేసుతో పోలీసులు విచారణ చేయగా మరిన్ని విషయాలు బయటపడ్డాయి. మాజీ ఐపీఎస్ పేరుతో ఫోన్స్ చేస్తూ స్థానికులను భయపెట్టే వారనే విషయాలు కూడా బయటపడ్డాయి. దళిత యువకుడికి శిరోముండనం చేసిన నూతన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here