నూతన్ నాయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Advertisement

పెందుర్తి శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడును ఇవ్వాళ ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరులో తప్పించుకొని పారిపోతున్న నూతన్ నాయుడిని అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య ప్రియా మధురిని, మరో ఏడుగురిని అధికారులు అరెస్ట్ చేశారు.

నూతన్ నాయుడి భార్య ప్రియా మాధురి ఆధ్వర్యంలోనే శిరోముండనం జరిగిందని సీపీ తెలిపారు. అలాగే ఇప్పటికే పట్టుబడిన వారిదగ్గర నుండి 7మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ ఘటనకు కారణమైన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని సీపీ వెల్లడించారు. నూతన్ నాయుడిని విచారించిన తరువాతే మిగితా విషయాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. శిరోముండనం కేసులు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసమర్ధ పాలన వల్లే దళితులపై ఈ దారుణాలు జరుగుతున్నాయని టీడీపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ శిరోముండనం ఘటనకు పాల్పడిన వారికి ప్రభుత్వం ఎలాంటి శిక్ష విడిస్తుందో వేచి చూడాలి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here