Bulletu Bandi Song: ఆసుప‌త్రిలో బుల్లెట్ బండి సాంగ్‌కు న‌ర్సు డ్యాన్స్.. ఉద్యోగానికి ఎస‌రు

Bulletu Bandi Song: జాన‌ప‌ద పాట‌ల‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవ‌ల ఓ మ‌హిళ బరాత్‌లో .. భర్తతో జీవితాంతం కలిసి ఉంటానని తెలుపుతూ ఆనందంలో డ్యాన్స్ చేసింది. ఇందుకు సింగర్ మోహన భోగరాజు పాడిన ‘బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా..’పాట తోడైంది. ఇంకేముంది ఆమె డ్యాన్స్ సూపర్ హిట్.


Nurse dance on Bulletu Bandi Song goes Viral
Nurse dance on Bulletu Bandi Song goes Viral

ఆమె డ్యాన్స్‌లో గ్రేస్, పాటలోని పదాలకు అనుగుణంగా స్టెప్స్ వేయ‌డంతో ఫుల్ వైర‌ల్ అయింది. పాటకి కూడా క్రేజ్ ద‌క్కింది. ఇప్పుడు ఎక్క‌డ చూసిన ఈ పాట‌నే పాడ‌డం, ఇదే పాట‌కు డ్యాన్స్ లు చేయ‌డం వంటివి చేస్తున్నారు.ఇప్పుడు అదే సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి, చిక్కులో పడిందో నర్సు. పంద్రాగస్టు రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి PHCలో ఓ నర్సు బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్‌ చేసింది.

ఆసుప‌త్రిలో డ్యాన్స్ చేసిన విష‌యం అధికారుల దృష్టికి వెళ్ల‌డంతో జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌ రావుఈ వ్యవహారంపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నారు. ఆన్‌ డ్యూటీలో ఉండటమే కాకుండా.. ఇండిపెండెంట్స్‌ డే రోజున ఇలా పాటలు పెట్టుకోని డ్యాన్స్‌లు చేయడంపై మండిపడ్డారు. . దీనిపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం డాన్స్‌ చేసిన స్టాఫ్‌ నర్స్‌కు మోమో జారీ చేశారు. కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.


ఆసుపత్రిలో డ్యాన్స్‌ చేయడం అనేక విమర్శలకు దారి తీస్తోంది. పంద్రాగస్టు రోజున తోటి ఉద్యోగులు ఎంకరేజ్‌ చేస్తేనే తాను డ్యాన్స్‌ చేశానని ఆమె అంటోంది. తాను డ్యూటీకి డుమ్మా కొట్టి ఎంజాయ్‌ చేయలేదని ఆమె చెప్తోంది.ఈమె క‌రోనా రోగుల‌కి సేవ‌లు చేస్తూ వైర‌స్ బారిన ప‌డి కోలుకుంది