NTR: 18 ఏళ్ల ‘సింహాద్రి’ .. తెరవెనక నిజాల గురించి మీకు తెలుసా..?

NTR: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో సింహాద్రి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సినిమాతో సూపర్ స్టార్ అయిపోయాడు నందమూరి చిన్నోడు. కేవలం 20 ఏళ్ళ వయసులో నెంబర్ వన్ కుర్చీ కోసం పోటీ పడ్డాడు. అప్పటికే స్టూడెంట్ నెంబర్ వన్, ఆది సినిమాలతో మంచి విజయాలు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. సింహాద్రి సినిమాతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయాడు.

2003లో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా విడుదలై జులై 9, 2021కి 18 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దీని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. సింహాద్రి సినిమా వెనక ఇంకా చాలా పెద్ద కథ ఉంది. ఈ సినిమా కథ ఎప్పుడో రాసిపెట్టి ఉన్నదని.. నిజానికి బాలయ్యతో సింహాద్రి సినిమా చేయాలని చెప్పాడు విజయేంద్రప్రసాద్.

బి.గోపాల్ దర్శకత్వంలో ఈ సినిమా చేయాల్సి ఉన్నా.. ఆ కథ ఆయనకు నచ్చకపోవడంతో సెట్స్ పైకి వెళ్లలేదు అని చెప్పాడు విజయేంద్రప్రసాద్. అప్పటికే అన్నమయ్య నిర్మాత దొరస్వామిరాజుతో రాజమౌళి ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సమయంలో తన కొడుకు కోసం అయితే సింహాద్రి కథ ఇస్తాను అంటూ తాను చెప్పడం.. అందులోకి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి అని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్.

అసలు ఈ కథ పుట్టడం వెనుక మరో కథ కూడా ఉంది. చెన్నైలో ఒకసారి విజయేంద్రప్రసాద్ తన అసిస్టెంట్ తో కలిసి వసంత కోకిల సినిమా చూస్తున్నప్పుడు.. సింహాద్రి సినిమా ఆలోచన పుట్టింది. క్లైమాక్స్ లో కమల్ హాసన్ ను చూసి హీరోయిన్ శ్రీదేవి గుండెల్లో గుచ్చేసి వెళ్లిపోయింది కదా అని సరదాగా తన అసిస్టెంట్ తో అన్నాడు విజయేంద్ర ప్రసాద్. ఇది ఇంటర్వెల్ గా చేసి కథ రాయడం మొదలు పెట్టామంటూ చెప్పుకొచ్చాడు ఈయన.

అందుకే సింహాద్రి ఇంటర్వెల్ లో భూమిక గునపంతో జూనియర్ ఎన్టీఆర్ గుండెల్లో గుచ్చుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది.. ముందు ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. మొత్తం పూర్తయ్యాక బాలయ్యకు చెప్తే ఒప్పుకోకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ లైన్ లోకి రావడం.. అది చరిత్ర సృష్టించడం అన్నీ జరిగిపోయాయి అంటూ ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో పాత విషయాలు గుర్తు చేసుకున్నారు విజయేంద్ర ప్రసాద్. ఈ సందర్భంగా సింహాద్రి టోటల్ కలెక్షన్స్ ఇప్పుడు చూద్దాం..

నైజాం: 6.47 కోట్లు
సీడెడ్: 5.50 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.32 కోట్లు
ఈస్ట్: 1.80 కోట్లు
వెస్ట్: 1.70 కోట్లు
గుంటూరు: 2.20 కోట్లు
కృష్ణా: 1.86 కోట్లు
నెల్లూరు: 1.30 కోట్లు

ఏపీ + తెలంగాణ: 23.15 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 2.25 కోట్లు
వరల్డ్ వైడ్: 25.40 కోట్లు

సింహాద్రి సినిమాకు అప్పట్లో 11.4 కోట్ల బిజినెస్ జరిగింది. వచ్చిన వసూళ్లు 25 కోట్లకు పైగానే. బయ్యర్లకు 14 కోట్ల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. సింహాద్రి తర్వాత జూనియర్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.