ఎన్టీఆర్ కూడా రాం చరణ్ ను ఫాలో అవుతున్నారా?

Advertisement

ఎన్టీఆర్, రాం చరణ్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటికే రాం చరణ్ కు సంబంధించిన టీజర్ కూడా విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే రాం చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తూనే సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. అలాగే ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీలో గెస్ట్ పాత్ర చేయడానికి సిద్దయ్యారని సమాచారం.

ఇన్ని రోజులు చరణ్ వేరే పనులు చేస్తున్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం కేవలం ఆర్ఆర్ఆర్ లో నటిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా రాం చరణ్ బాటలో నడుస్తున్నాడని సమాచారం. ఆర్ఆర్ఆర్ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారని ముందే ప్రకటించిన విషయంతెలిసిందే. కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడటం వల్ల ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీలో నటించడానికి సిద్ధమవుతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు నిజమో కాదో ఎన్టీఆర్ మాత్రమే చెప్పగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here