NTR30 : కొరటాల శివ – ఎన్టీయార్ కాంబో.! ఆగిపోయిందా.? పట్టాలెక్కుతుందా.?

NQ Staff - October 7, 2022 / 07:04 PM IST

NTR30 : కొరటాల శివ – ఎన్టీయార్ కాంబో.! ఆగిపోయిందా.? పట్టాలెక్కుతుందా.?

NTR30 : ‘ఆచార్య’ సినిమా దెబ్బతో దర్శకుడు కొరటాల శివ ఇమేజ్ దారుణంగా పడిపోయింది. ఒక్క సినిమాతో ఓ దర్శకుడి ప్రతిభను తక్కువగా అంచనా వేయలేంగానీ, ‘ఆచార్య’ సినిమాని ఇలా ఎలా తీశాడు.? అనైతే అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, అక్కడ చిరంజీవి – రామ్ చరణ్ కాంబినేషన్ దొరికింది కొరటాల శివకి. దాన్ని ఆయన వృధా చేసుకున్నాడు.

ఇంకోపక్క ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పెరిగిపోయిన యంగ్ టైగర్ ఎన్టీయార్ ఇమేజ్, కొరటాల శివకు చాలా పెద్ద సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ, జూనియర్ ఎన్టీయార్‌తో తెరకెక్కించాల్సిన సినిమా విషయమై తటపటాయిస్తున్నాడు.

ఆగేది లే.. ముందుకే..!

కొరటాల – జూనియర్ ఎన్టీయార్ కాంబో ఆగిపోయిందనే ప్రచారం నడుమ, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఆసక్తికరమైన విషయాన్ని బయటపెడుతోంది. అదేంటంటే, త్వరలో.. అతి త్వరలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి సూపర్బ్ అప్‌డేట్ రాబోతోందిట.

ఈ నెలలోనే ఈ అప్డేట్ వుంటుందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తాలూకు సారాంశం. సినిమా ఆగలేదనీ, కొరటాల కొంత సమయం తీసుకున్నమాట వాస్తవమేననీ, అతని మీద జూనియర్ ఎన్టీయార్ పూర్తి నమ్మకంతో వున్నాడనీ తెలుస్తోంది.

హమ్మయ్య.. అని అభిమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చిందన్నమాట.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us