ప్రగతి భవన్ ను చుట్టుముట్టిన యన్ఎస్ యూఐ కార్యకర్తలు

Advertisement

హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేయలని యన్ఎస్ యూఐ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ను ముట్టడించారు. ప్రవేష పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

పీపీఈ కిట్స్ ధరించి ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు రిమాండ్ కు తరలించారు. ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని యన్ఎస్ యూఐ కార్యకర్తలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై ఇంకా విచారణ జరగక ముందు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని యన్ఎస్ యూఐ నేతలు ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన్నందుకే రిమాండ్ కు తరలించామని పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here