ఈ ఒక్క ఏడాదికే ‘డ్రీమ్’ : బీసీసీఐ

Advertisement

ఐపీల్ 2020 టైటిల్ స్పాన్సర్ షిప్ విషయంలో ఇండియాకు చెందిన చాలా కంపెనీలు పోటీ పడ్డ చివరకు డ్రీమ్ 11 సంస్థ టైటిల్ స్పాన్సర్ షిప్ ను సొంతం చేసుకుంది. అయితే తాజాగా డ్రీమ్ 11 లో చైనా పెట్టుబడులు ఉన్నాయని, ఆ సంస్థను ఐపీల్ స్పాన్సర్ షిప్ నుండి తొలగించాలని కొందరు స్పందించారు. అయితే ఈ విషయంలో బీసీసీఐ కూడా స్పందించింది. డ్రీమ్ 11 లో పని చేస్తున్న వారందరు కూడా భారత్ కి చెందిన వారే అని తెలిపారు. అలాగే డ్రీమ్ లో చైనా పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించారు.

అయితే తాజాగా బీసీసీఐ మరో విషయాన్ని తెలిపింది. ఐపీల్ 2020 కి స్పాన్సర్ షిప్ గా డ్రీమ్ 11 ఈ ఒక్క ఏడాది మాత్రమే ఒప్పందం కుదుర్చున్నాం అని ప్రకటించింది. అలాగే 2021, 2022 సీజన్లకు కూడా స్పాన్సర్ ‌షిప్‌ హక్కుల కోసం చెరో రూ.240 కోట్లను చెల్లిస్తామన్న ఆ సంస్థ ప్రతిపాదనను బీసీసీఐ బోర్డు తిరస్కరించింది. అయితే తక్కువ మొత్తం చెల్లిస్తుండటమే ఇందుకు కారణమని తెలిసింది. ఐపీఎల్‌ 2020 టైటిల్‌ స్పాన్సర్‌గా డ్రీమ్‌ 11 ను ఐపీఎల్‌ పాలక మండలి అధికారికంగా ప్రకటించింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here