Ippatam Villagers : ఇప్పటం రగడ : పిటిషనర్లకు షాకిచ్చిన హైకోర్టు.!
NQ Staff - December 14, 2022 / 01:10 PM IST

Ippatam Villagers : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణంగా ఇప్పటం గ్రామం వార్తల్లోకెక్కింది. ఈ గ్రామంలోనే జనసేన పార్టీ గతంలో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు. ఆ సభ నిర్వహణ కోసం గ్రామస్తులు తమ భూముల్ని ఇచ్చారు. ఇందుకు కృతజ్ఞత చెబుతూ, 50 లక్షల రూపాయల్ని గ్రామాభివృద్ధి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు కూడా.
కాగా, గ్రామంలో రోడ్ల వెడల్పు నిమిత్తం అధికారులు కూల్చివేతలు చేపట్టగా, ఈ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమయ్యింది. మరోపక్క, ఇప్పటం గ్రామస్తులు కూల్చివేతల వ్యవహారంపై తప్పుడు సమాచారం ఇచ్చారంటూ హైకోర్టు మొట్టికాయలేసింది. పిటిషన్ దారులకు లక్ష రూపాయల చొప్పున జరీమానా కూడా విధించింది.
తగ్గేదే లేదన్న హైకోర్టు..
జరీమానా తగ్గించాలంటూ ఇప్పటం గ్రామస్తులు హైకోర్టుకి విజ్ఞప్తి చేయగా, వారి విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. దాంతో, పిటిషన్ దారులు లక్ష రూపాయల చొప్పున జరీమానా చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
మరోపక్క, కూల్చివేతల కారణంగా బాధితులైనవారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించిన సంగతి తెలిసిందే. ఈ సాయంపైనా విమర్శలు వస్తున్నాయి.