సీఎం జగన్ కు నోటీసులు జారీ చేసిన హై కోర్ట్

Advertisement

ఏపీలో మూడు రాజధానుల అంశం తీవ్రస్థాయికి చేరుకుంది. స్టేటస్ ఇచ్చిన తరువాత కూడా విశాఖలో అతిథి గృహ నిర్మాణం ఎలా చేపడతారని హై కోర్ట్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత హోదాల్లో వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వైకాపా సీనియర్‌ నేత, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు నోటీసులు జారీ చేసింది. తెదేపా, వైకాపా, భాజపా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీల అధ్యక్షులకూ నోటీసులిచ్చింది. వారు ఈ వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని భావిస్తే మూడు వారాల్లో వేయాలని సూచించింది.

అలాగే స్టేటస్ కో అమలులో ఉండగా అతిథి గృహ నిర్మాణం ఎందుకు చేపట్టారో వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. అలాగే రానున్న రోజుల్లో విచారణ భౌతికంగా చేపట్టాలా లేక ఆన్లైన్ ద్వారా చేపట్టాలా అనే అంశాన్ని విచారణకు వారం రోజుల ముందు తెలియజేస్తామని కోర్ట్ తెలిపింది. అలాగే మూడు రాజధానులపై ఉన్న స్టేటస్ కో ను సెప్టెంబర్ 21 వరకు పెంచిన విషయం తెలిసిందే.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here