Kim Jong : రోజంతా ఏడుస్తూ మద్యం తాగుతూనే ఉన్న కిమ్
NQ Staff - January 17, 2023 / 10:26 AM IST

Kim Jong : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ మానసిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదంటూ అంతర్జాతీయ మీడియా సంస్థ మిర్రర్ ఒక కథనంలో పేర్కొంది. ఆ కథనం అనుసారం ప్రస్తుతం కిమ్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని మానసిక సమస్యను ఎదుర్కొంటున్నాడట.
ఆయన మానసిక సమస్యకు చికిత్స కూడా తీసుకుంటున్నాడని ఆ కథనంలో పేర్కొన్నారు. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే పురుషులు మధ్య వయసులోకి వచ్చినప్పుడు కలిగే అసంతృప్తి, ఆందోళన, నిరాశ కారణంగా మానసిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.
కిమ్ 40 సంవత్సరాల వయసుకు వచ్చాడు. అందుకే ఆయన ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడట. ప్రస్తుతం ఆయన రోజులో ఎక్కువ భాగం మద్యం తాగుతూ ఏడుస్తూనే ఉన్నాడని కొరియన్ విద్యావేత్త డాక్టర్ చోయి పేర్కొన్నారు.
కిమ్ ఎక్కువగా మద్యం తాగుతున్నాడని తనకు సమాచారం అందిందంటూ ఆయన తెలియజేశాడు. ప్రస్తుతం కిమ్ యొక్క మానసిక పరిస్థితి నేపథ్యంలో అధికారులు మరియు కిమ్ ప్రభుత్వంలో ఉన్నవారు ఏం చేయాలో పాలు పోక దిక్కులు చూస్తున్నారట.
ఇప్పటికే ఉత్తర కొరియా తీవ్ర సంక్షోభంలో ఉంది, ఇలాంటి సమయంలో అధ్యక్షుడి పరిస్థితి ఇలా ఉంటే ఆ దేశం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.